TV77 తెలుగు ధవలేశ్వరం :
రాజమహేంద్రవరం ధవళేశ్వరం వద్ద గోదావరికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 10 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరానికి వరద పెరుగుతోంది.ఈ నేపథ్యంలో బ్యారేజీ 175 గేట్ల ద్వారా 4.83 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.