TV77తెలుగు రాజమహేంద్రవరం :
బీసీ, యస్.సి ల కలయికతో నాడు కలలు కన్న స్వప్నం నేడు కార్యరూపం దాల్చిన మొదటి అడుగుగా అభివర్ణించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్.రాజమండ్రి గోదావరి బండ్ జ్యోతీ రావు ఫూలే విగ్రహం ఎదురుగా వున్న ఖాళీ స్థలంలో ఫూలే అంబేద్కర్ భవనం నిర్మాణానికి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.స్థలాన్ని పరిశీలించిన శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు. రాజ్యసభ సభ్యులు, రీజినల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్ర బోస్. సంవత్సరాల నుండి బీసీ, యస్.సి లు ఎదురుచూసిన ఈ ఫూలే అంబేద్కర్ భవన నిర్మాణం త్వరలో కార్యరూపం దాల్చనుందని ఎంపీ భరత్ తెలిపారు.హోరున కురుస్తున్న వర్షంలో కూడా మండలి చైర్మన్, పార్లమెంట్ సభ్యులు స్వయముగా వచ్చి స్థలాన్ని పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం వై యస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ రోజు న సాకారం అయ్యింది అని ఎంపీ భరత్ తెలిపారు.మండలి చైర్మన్ మరియు పార్లమెంట్ సభ్యులు బోస్ ఈ భవనం నిర్మాణం బీసీ, యస్.సి ల కలయిక విజయమని, దీని వెనుక మార్గాని భరత్ గారి కృషి, పట్టుదల ఉన్నాయని, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్న వ్యక్తి భరత్ అని తెలిపారు.రేపు 08.09.2022 గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు రాజమండ్రి గోదావరి బండ్, ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర గల త్యాగారాజా కళ్యాణ మండపం నందు బీసీ, యస్.సి ల కలయిక లో సాధించుకున్న ఫూలే అంబేద్కర్ భవనం సందర్భముగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రమంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ , కారుమూరి నాగేశ్వరరావు , జోగి రమేష్, పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ) పిల్లి సుభాష్ చంద్రబోస్ , మోపిదేవి వెంకట రమణ , ఆర్.కృష్ణయ్య , బీడ మస్తాన్ రావు , పార్లమెంట్ సభ్యులు (లోకసభ) చింత అనురాధ , నందిగం సురేష్ , శాసన సభ్యులు తలారి వెంకటరావు , పొన్నాడ సతీష్ కుమార్, కొండేటి చిట్టిబాబు , రాపాక వర ప్రసాద్ పాల్గొంటారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, రాష్ట్ర మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పాలిక శ్రీను, వాకచర్ల కృష్ణ, అరవ సురేష్, దూర్వాసుల సత్యనారాయణ, నీలి ఆనంద్, గుర్రం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.