లోన్ యాప్ ల మాయాజాలం వెనుక ప్రభుత్వ పెద్దల సృష్టి వుందా ! మేడా శ్రీనివాస్


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

ఆర్ బి ఐ-ట్రాయ్ ల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి ! 

సైబర్ నేరాల అదుపుకు ప్రభుత్వ ప్రోత్సాహం శూన్యం

గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర కేంద్రాలుగా స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి.

సైబర్ నేరగాళ్ళను కనిపెట్ట గల దమ్ము మన పోలీస్ కు వుంది. అయినా మోనం ఎందుకు. 

రాజమండ్రి లో "లోన్ యాప్" ల కారణంగా మరణించిన వారి బిడ్డల భవిష్యత్ కై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  10 కోట్లు సహాయం ప్రకటించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.ఋణ యాప్ ల ముసుగులో ప్రభుత్వ పెద్దల హస్తం వుందా ! అని,ఎన్నికల మోసాల్లో గెలవటానికి,అధికారం దుర్వినియోగ కుట్రలను, సమాంతర మాఫియా సామ్రాజ్యాన్ని ప్రభుత్వ  పెద్దలే ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, రాజకీయ సొంత ప్రయోజనాలను పొందటానికి, వాస్తవ నేరాలను కాలయాపన చేయుటకు సిబిఐ దర్యాప్తులను కోరే రాజకీయ ప్రముఖులు లక్షల కోట్ల కుంభకోణానికి కారణమైతు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న లోన్ యాప్ ల నేరగాళ్ళను పట్టుకోలేక పోవటం పచ్చి అబద్దమని, వ్యూహాత్మకంగానే సైబర్ నేరగాళ్ళను కొంతమంది ప్రభుత్వ పెద్దలే సృష్టించారని, సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండండి అని అధికారిక ప్రకటనలు చేయటం సిగ్గుమాలిన ప్రచారాలు చేయటం ప్రజల దురదృష్టం గా భావించాలని ఆయన తీవ్ర ఆక్షేపణ  చెందారు.లోన్ యాప్ ల మాఫియా సృష్టి కర్తల అక్రమ ఆర్ధిక లావాదేవీలు యథేచ్ఛగా జరుగుతున్నాయంటే అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), "ట్రాయ్" సంస్థల ఆశీస్సులు నేరగాళ్లకు లేకుండా ఉంటాయా  ! నేడు బ్యాంక్ లావాదేవీలకు సామాన్యుడు ఆర్ధిక దోపిడీకి గురైతున్న్నారని,ఆర్ధిక నేరగాళ్లు స్వేచ్ఛగా సెలబ్రేటిస్ వలే భారత్ లో రాజకీయాలను శాసిస్తున్నారని, ఆర్బీఐ పర్యవేక్షణ లో బ్యాంక్ ఖాతా దారులకు భద్రత లేదు, ట్రాయ్ పర్యవేక్షణ లో సైబర్ నేరాలకు నియంత్రణ లేదని, ఈ రెండు సంస్థల పనితీరు ను నీరుగారుస్తున్నది కేంద్ర ప్రభుత్వ పెద్దలేననే అనుమానాలు బాధిత ప్రజలను వెంటాడుతున్నాయని,వెబ్ నెట్ వర్క్ ను కనిపెట్టటం మన భారత పోలీస్ లకు సాధ్యం కాలేక పోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేక, భారతదేశ పోలీస్ వ్యవస్థ లో నిష్టాతులైన, నిపుణులైన పోలీసులు వున్నారని, వారి ప్రతిభను వెలుగుచూడనీయకుండా తొక్కి పడేస్తున్నారని, సాంకేతికతను కనిపెట్టడంలో జాప్యం జరిగినా సైబర్ నేరగాళ్ల ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నాయంటే ఆర్బిఐ ఉదాసీనత కాదా ! సైబర్ నేరగాళ్లకు మేలుచేసే విధంగా ట్రాయ్ సంస్థ నిమ్మకునీరెత్తినట్లు చోద్యం చుస్తూండటం అనేక అనుమానాలకు తావిస్తోందని, లోన్ యాప్ ల మాఫియా కు కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐ, ట్రాయ్ పెద్దల సహాయ సహకారాలు వున్నాయనటంలో ఏ మాత్రం సందేహం లేదని ఆయన తెలిపారు.సైబర్ నేరాలను అదుపు చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, సైబర్ నేరగాళ్ల ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నాయని, నేరాలను అదుపు చేయటమే సాధ్యం కావటం లేదని ప్రభుత్వం రిక్త హస్తాలు చూపటం దారుణమైన ఘటనగా భావించాలని, ఉద్దేశ్యపూర్వకం గానే సైబర్ నేరగాళ్ళను గుర్తించి పట్టుకోలేక పోతున్నారని, బ్యాంక్ లలో ఖాతా దారుల సొమ్ముకు భద్రత లేకుండాపోయిందని , ఈ తరహా నేరాలను చూసి చూడనట్టుగా వుంటున్న  ప్రభుత్వాల పట్ల ప్రజలకు ఎందుకు నమ్మకం వుంటుందని, భవిష్యత్ లో కార్పోరేట్ బ్యాంక్ లను ప్రోత్సహించటానికే ప్రభుత్వ బ్యాంక్ ల సేవలను బలహీనపరుస్తున్నారని, సైబర్ నేరగాళ్ళు అంటే నైజిరిన్స్ అనే ప్రచారంలో ఎంత నిజముందో లోన్ యాప్ ల ద్వారా సైబర్ నేరాల సృష్టి కర్తలు అంత మోది సర్కార్  సేవకులేనని, సైబర్ నేరాల ద్వారా దోచుకున్న సొమ్ము హవాలా మార్గాల ద్వారా అధికార పార్టీలకు పెద్దమొత్తంలో దారి మార్గం చేస్తున్నారని, సైబర్ ఆర్ధిక నేరాలన్ని ఆర్బిఐ, ట్రాయ్ లకు తెలిసే జరుగుతాయనటంలో ఏ మాత్రం అనుమానం లేదని, ప్రజల సొమ్ముకు, భద్రత కల్పించలేని ప్రభుత్వాలు పాలనకు అనర్హులని, కొన్ని యాప్ ల పట్ల అప్రమత్తం గా వుండండి అని ప్రభుత్వాలు ప్రజలకు సూచించటం దొంగే దొంగ దొంగ అని అరుసున్నట్టు వుందని, సైబర్ ఆర్ధిక నేరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తు సొంత లబ్ది పొందుతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు. సైబర్ నేరాలన్నింటికీ ప్రధాన కేంద్రాలుగా గుజరాత్,ఢిల్లీ, అహ్మదాబాద్,  రాజస్థాన్, మధ్యప్రదేశ్,యుపి  మహారాష్ట్ర ప్రాంతాలనుండి మొబైల్ సిమ్స్ చిరునామాలు, ఐడెంటిటీ ప్రూఫ్ లు వెలువడుతున్నాయని, ఇతర దేశాల నుండి కొంతమంది యువతను ఈ సైబర్ నేరాలకు కేంద్ర పెద్దలు స్లీపర్ సెల్స్ గా వినియోగించు కుంటున్నారని, అక్కడ ప్రభుత్వాలు సైతం సైబర్ నేరగాళ్ళను పోషిస్తు రాజకీయ ఆర్ధిక ప్రయోజనాలు పొందుతున్నాయని,బాధితులను పోలీసులకు పిర్యాదు చేయండి అని కంటి తుడుపు సందేశాలతో ఆర్ధిక నేరగాళ్ళకు మించి మోసం చేస్తున్నారని, మానవ జీవితానికి భద్రత లేని విధంగా హేండ్ రైడ్ మొబైల్స్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం సైబర్ నేరాల పట్ల అప్రమత్తం గా వుండండి అంటు చౌకబారు ప్రకటనలు చేయటానికి సిగ్గు పడకపోవటం దౌర్బాగ్య పోకడగా భావించాలని ఆయన తెలిపారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఋణ యాప్ లను నిర్ములిస్తాం అని ప్రకటించటమే ఈ నేరాలకు కేంద్ర పెద్దల హస్తం వుంది అని అర్థమైతుందని,ఈ లక్షల కోట్ల ఆర్ధిక నేరాలకు అనధికారికంగా చూసి చూడనట్లు ప్రోత్సహించేది ప్రభుత్వ పెద్దలెనని, ప్రజా ఆగ్రహం వెల్లువెత్తే సరికి త్వరలోనే అరికడతాం అని ప్రకటించేది సూత్రధారులైన ప్రభుత్వ పెద్దలే నని, ఎన్నికలకు అవసరమైన లక్షల కోట్లు కొంతమంది కార్పోరేట్ ఆర్ధిక నేరగాళ్ల కనుసైగలో ఈ తరహా నేరాలకు వ్యూహ రచనలు చేస్తు తదుపరి ముగింపు పలకటమే ఈ నేరాల వ్యూహం అని, 2024 ఎన్నికలను గమనించి త్వరలోనే ఋణ యాప్ ల మోసాలను ప్రభుత్వం నియంత్రిస్తుందని, అనంతరం కొత్త సైబర్ నేరం తో దోపిడీకి సిద్దపడతారని, ప్రజల్లో మార్పు, ఓటు చైతన్యం, సామాజిక భాద్యత, ఆర్ధిక సంస్కరణలు రానన్నాళ్లు మోసగాళ్లు పుడుతూనే వుంటారని, రాజకీయ మార్పు తోనే ఈ తరహా నేరాలను కట్టడి చేయగలం అని, ఏ బలహీనతలకు తావులేని విప్లవాత్మకనైన ప్రజా చైతన్యం, తిరుగుబాటు తోనే మెరుగైన పాలన సాధ్యం అని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు.సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, సత్తి వెంకటరెడ్డి ,  దుడ్డె సురేష్, వాడపల్లి జ్యోతిష్, వర్ధనపు శరత్ కుమార్, తలారి  విజయలక్ష్మి, వల్లి శ్రీనివాసరావు , మోర్త ప్రభాకర్ , గుడ్ల సాయి దుర్గాప్రసాద్ , ములికి శ్రీనివాసరావు, కొల్లి వెంగళరావు, కంకిపాడు రాజు, ముప్పన రాజు, వంగా సాయి,  కారుమూరి శిరీషా, కారుమూరి యుగంధర్త, సుంకర వెంకట భాస్కర రంగారావు , నాగూరి బాబీ , నాగురి దుర్గ , మాసా అప్పాయమ్మ, వట్టి శ్రీనివాస్, నడిపూడి శ్రీనివాసరావు , అడపా శేషగిరి , ఎస్ కె ఆగాషరీఫ్ , ఉండ్రాజవరపు రవితేజ , రెడ్డి స్వర్ణలత , కాటం రాజశేఖర్ , మేకల కిరణ్ కళ్యాణ్  పాల్గొనియున్నారు.