TV77తెలుగు రావులపాలెం క్రైమ్ :
కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన భార్యాభర్తలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి తెలిపిన వివరాలు ప్రకారం జొన్నాడకు చెందిన గన్ని బాబురావు (70), కృష్ణవేణి (65) దంపతులు ద్విచక్ర వాహనంపై రావులపాలెం వైపు వెళ్ళుచుండగా అదే మార్గంలో వస్తున్న ఐసర్ వ్యాన్ వారిని వెనుక నుండి ఢీ కొని వారి పైనుండి వెళ్లిపోవడంతో వారు ఇరువురు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు దీనిపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.