సెయింట్ పీటర్స్ లూధరన్ చర్చ్ పాస్టర్ పై ఎఫ్ ఐ ఆర్


 TV77 తెలుగు రాజమహేంద్రవరం :

సెయింట్ పీటర్స్ లూధరన్ చర్చ్ పాస్టర్ ( దైవజనుడు ) ధనదాహం

  తూ.గో.జిల్లా సినడ్ గా ఆర్ధిక దోపిడీ

 రూ 4 లక్షలు చర్చ్ సొమ్ము స్వాహా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు

క్రైస్తవత్వాన్ని భ్రష్ట పట్టిస్తున్న పాస్టర్ 

దైవభీతి. నైతిక విలువలు లేని బోధన ఆదర్శనీయమా.?

గుంటూరు కేంద్రంగా రాష్ట్రంలోని క్రైస్తవులకు. దైవపరంగా పరిపాలన పరంగా మార్గదర్శకం వహిస్తున్న ఆంధ్ర ఏవాంజికల్ లూథరన్ చర్చ్ ( ఏ ఈ ఎల్ సి ) ఇటీవల కాలంలో పేరు ప్రతిష్టలను కోల్పోతుంది. నైతిక విలువలు లేని పరిపాలికులు పుట్టుక రావడంతో గత కొంతకాలంగా సంస్థకు చెందిన విలువైన భూములు. సంస్థల ఆస్తులు చర్చి కార్యకలాపాలు. అవినీతి అక్రమాలతో వివాదాలు తలెక్కుతున్నాయి

 ఈ సంస్థకు చెందిన పెద్ద తలకాయలతో పలువురు సీనడ్ లు. పాస్టర్లు కుమ్మక్కై సంస్థ ఆస్తులను అక్రమంగా అమ్మేస్తూ కోట్లాది రూపాయలను దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

 ప్రశాంతమైన గోదావరి జిల్లాలోని ఇటువంటి అరాచకాలు. అక్రమాలు. అవినీతి చర్యలకు. ఏ ఈ ఎల్ సి పెద్దలు తెర లేపడం ఇందులో స్థానిక పాస్టర్లను పావులుగా మార్చుకోవడం పరిపాటిగా మారింది.

రాజమహేంద్రవరం నగరంలో సానిటోరియం చర్చ్, రక్షణలయం, షాడే బాలికల హై స్కూల్ స్థలాలు విషయాల్లో పాస్టర్లకు సంఘ విశ్వాసులకు మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. 

తాజాగా ఇదే కోవలో ధనవంతుల చర్చిగా పేరుగాంచిన ప్రకాష్ నగర్ సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ లో గత రెండేళ్లుగా దైవజనుడు గా దైవ బోధనలు చేస్తున్న పాస్టర్ అక్క బత్తుల  సామ్యూల్ రాజ్ కు విశ్వాసులకు, పీసీసీ సభ్యులకు వివాదాలు భౌతిక ఘర్షణలు తలెత్తి విశ్వాసుల ఐక్యతకు విచ్చిన్నo కలిగిస్తుందని సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ మాజీ  ఎలక్టెడ్ పిసిసి సభ్యుడు, ట్రెజరర్ వర్ధనపు విక్టర్ సమాధానం ఆవేదన వ్యక్తం చేశారు.

చర్చి పాస్టర్ గా ఉన్న అక్కాబత్తుల  శామ్యూల్ రాజ్ క్రీస్తు బోధనలతో నైతిక విలువలతో చర్చి విశ్వాసులకు, సమాజంలో ఆదర్శంగా నిలవాల్సిన శామ్యూల్ రాజ్ ధన దాహంతో కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ చర్చి ప్రశాంతతకు విశ్వాసుల ఐక్యతకు విచిన్నకారుడుగా మారారని ఆయన విమర్శించారు. 

ఏ ఈ ఎల్ సి అధ్యక్షుడిగా ఉన్న పరదేశి బాబు మరికొందరు పెద్దల ప్రాపకం తో తూర్పుగోదావరి జిల్లా సినడ్ గాను, చర్చి పాస్టర్ గాను  ద్విపాత్రభినయంతో జిల్లాలోని చర్చిల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటూ ఏ ఈ ఎల్ సి పెద్దలతో కుమ్మక్కై స్వాహా చేస్తుండడం ప్రవృత్తిగా మార్చుకున్నారన్నారు.

సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ లో ఐదు వార్డులు ఉన్నాయి. 2000 మంది విశ్వాసులు ఉన్నారు. ఐదు వార్డుల నుంచి ఐదుగురిని విశ్వాసులు ఎన్నుకుంటారని. ఆ విధంగా టి సుమన్, పి శేఖర్ బాబు, ఎన్ శ్యామ్ సన్, వద్దనపు విక్టర్ సమాధానం లను ఎన్నుకున్నారని. వీరిలో వద్దనపు విక్టర్ ట్రెజరర్ గా వ్యవహరిస్తున్నారన్నారు 

 2021 - 2022 సంవత్సరానికి సంబంధించి ప్రతి చర్చిలో ఉండే  సువార్త ధన నిధి( ఎస్డిఎన్) విశ్వాసులు నుంచి వసూలు చేయడం పరిపాటి. ఈ నిధుల ను ఏ ఈ ఎల్ సి కి  రూ.4 లక్షల రూపాయలు చెక్ రూపంలో అందజేసేవారని. 

అయితే  2021 డిసెంబర్లో పాస్టర్ శామ్యూల్ రాజు నగదు రూపంలో ఇవ్వాలని, తానే గుంటూరు వెళ్లి ఏ ఈ ఎల్ సి  పెద్దలకు అందజేస్తానని పిసిసి సభ్యులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి చివరకు ఆ మొత్తాన్ని తీసుకుని గుంటూరు వెళ్లి ఏ ఈ ఎల్ సి కి జమ చేయకుండా  సొంతానికి స్వాహా చేసినట్లు పిసిసి సభ్యులకు తెలిసిందన్నారు.

ఈ సంఘటనపై చర్చ్ విశ్వాసులు, పిసిసి సభ్యులు పాస్టర్ శామ్యూల్ రాజును నిలదీశారని,  అంతేకాకుండా ఏ ఈ ఎల్ సి  పెద్దల దగ్గరికి వెళ్లి విచారించగా నగదు జమ కాలేదని నిర్ధారణ చేసుకున్నారన్నారు. 

ఈ వంచన పై వర్ధనపు విక్టర్ మరికొందరు సభ్యులు, విశ్వాసులు గట్టిగా నిలదీయడంతో పాస్టర్ నిర్లక్ష్యంగా పొంతన లేని సమాధానాలతో  విశ్వాసుల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా కుట్ర రాజకీయాలు చేస్తూ ఎలక్టడ్ బాడీని ఏకపక్షంగా పాస్టర్ రద్దు చేశారని ఆరోపించారు. 

2000 మంది ఉన్న విశ్వాసులను కాదని అతనికి అనుకూలమైన 150 మందితో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి తనకు అనుకూలమైన 18 మందితో అడహుక్ కమిటీ ని అనధికారంగా ఏర్పాటు చేసుకున్నారన్నారు

 ఈ నిర్ణయాన్ని వద్దనపు విక్టర్ వర్గీయులు వ్యతిరేకించారని,

 అంతేకాకుండా పాస్టర్ అరాచకలపై. ఆర్థిక అక్రమాలపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని. అయితే ఏ ఈ ఎల్ సి పెద్దల, అధికార పార్టీ అండ ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా ఉదాసీనత వహించారని  విక్టర్ వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు .

దాంతో  2022 జూలైలో ప్రైవేటుగా రెండవ అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో రెండు కేసులు వేయడం జరిగిందని. విచారణ జరిపిన కోర్టు ప్రాథమిక  సాక్షాదారాలను పరిశీలించి పాస్టర్ శామ్యూల్ రాజ్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి విచారణ చెయ్యాలని  కోర్టు పోలీసులను ఆదేశించిందన్నారు. ఆ మేరకు పోలీసులు ఈనెల 23 న ఎఫ్ ఐ ఆర్ (314/2022  )నమోదు చేసి  406. 477A, 155(2), సి ఆర్ పి సి సెక్షన్లు వేయడం జరిగిందన్నారు.. 

అయితే రూ, 4 లక్షల రూపాయలు స్వాహా చేసిన పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై చర్చ్ విశ్వాసులు, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో గత ఆరు నెలలుగా పాస్టర్ శామ్యూల్ రాజు అనుచరులు అడ్ హక్ కమిటీ సభ్యులు. ట్రెజరర్. నక్క ప్రకాష్ రాజ్. ఇంటి బెనర్జీ బాబు. ఇంటి విక్టర్ బాబు. బీర రాజశేఖర్. నక్క బెంజిమెన్ శ్యామ్  తదితరులతో కలిసి చర్చి కార్య కలాపాలను, విశ్వాసుల మనోభావాలను విఘాతం  కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని  వర్ధనపు విక్టర్ వర్గీయులు ఆరోపిపించారు. 

జిల్లా కలెక్టర్ కు  రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని. దీనిపై స్పందించిన మైనార్టీ కార్పొరేషన్ ప్రతినిధులు త్వరలో చర్చ్ ను సందర్శించి విశ్వాసులను విచారించేందుకు వస్తున్నట్లు తెలిసిందన్నారు.                   

సెంట్ పీటర్ చర్చ్ స్థాపకుల్లో అయిన హీరామ్స్ కుటుంబ సభ్యులు పెర్సీ హీరామ్స్, డేవిడ్ హీరామ్స్ కుటుంబ సభ్యులు, పాటలు సీనియర్ పాస్టర్ లు గడ్డం నెల్సన్ బాబు, బి డిపి రావు, యు జకరయ్య, కె శ్యామ్ సంపత్ , పాస్టర్ సునీల్ పలువురు ఎంతో ప్రతిష్టత్మకంగా అయిన  చర్చి కార్యకలాపాలు, ప్రతిష్ట  వివాదాస్పదం కావడం పట్ల ఆవేదం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 

ఇరు వర్గాలు శాంతియుతంగా. సామరస్యంగా వాస్తవాల ఆధారంగా సమస్యను పరిశించుకోవాలని పలువురు విశ్వాసులు హితవు పలుకుతున్నారు.

డిమాండ్లు..

దైవజనుడుగా క్రైస్తవత్వాన్ని బ్రష్టు పట్టిస్తూ చర్చి విశ్వాసుల మధ్య ఐక్యతను విచ్చిన్నం చేస్తున్న సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ పాస్టర్ అక్క బత్తుల శామ్యూల్ రాజ్ ను పదవి నుండి తొలగించాలి.

ఏ ఈ ఎల్ సి కి చెల్లించవలసిన చర్చ్ ఎస్ డి ఎన్ నిధులు రూ.4 లక్షలను స్వార్థానికి వినియోగించుకుని తిరిగి విశ్వాసులుపై నిందలు వేస్తూ విశ్వాసుల నమ్మకాన్ని వంచించిన పాస్టర్ నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలి.

పాస్టర్ పై 1 పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం అరెస్టు చేయాలి. 

 ఈ ఎల్ సి పెద్దల మద్దతుతో తూర్పుగోదావరి జిల్లా సినడ్ గా. పాస్టర్ గా. జిల్లాలోనూ. నగరంలోని అన్ని చర్చల్లోనూ అక్రమాలకు, ఆర్ధిక ఆర్ధిక దోపిడీకి పాల్పడుతున్న పాస్టర్ ఆక్కా బత్తుల శామ్యూల్ రాజు ను పదవి నుండి తొలగించాలని, అతనిపై రెవెన్యూ పోలీస్ మైనార్టీ కార్పొరేషన్ శాఖలు విచారణ జరిపించి శిక్షించాలని, ఇతన్ని ఏ ఈ ఎల్ సి సంస్థ నుండి తొలగించాలని విశ్వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.