పాము కాటుకు చిన్నారి మృతి


 TV77 తెలుగు చింతపల్లి :

పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలంలో చింతపల్లి గ్రామంలో ఇంటివద్ద ఆరుబయట ఆడుతుండగా చిన్నారిని పాము కాటు వేయ‌డంతో కేక‌లు పెట్టింది. ఇది గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించుతుండగా. మార్గమధ్యలోనే  చిన్నారి మృతి చెందింది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. చిన్నారి మృతితో చింతపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.