TV77 తెలుగు ఢిల్లీ :
రేపటి నుంచే ఇంటర్వ్యూలు
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బి ఈ సి ఐ ఎల్ ) ఒప్పంద ప్రాతిపదికన160 డేటా ఎంట్రీ ఆపరేటర్. ఆఫీస్ బాయ్, డేటా అనలిస్ట్ సో షల్ మీడియా అనలిస్ట్, రీసెర్చ్ అసోసియేట్ కంటెంట్ రైటర్, అసోసియేట్ కన్సల్టెంట్ క్రియేటివ్ కంటెంట్ రైటర్ గ్రాఫిక్ డిజైనర్ వీడియో ఎడిటర్, కన్సల్టెంట్ సీనియర్ కంటెంట్ రైటర్, సీనియర్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ లీడ్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల ( డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, బీటెక్ బీఈ ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీ, ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ సమయంలో జనరల్ ఓబీసీ అభ్యర్ధులు రూ.590, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ అభ్యర్ధులు రూ.295లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.8,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.