TV77తెలుగు తాడేపల్లి :
గుంటూరు జిల్లా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నులకపేటకు చెందిన 17 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు బాలిక కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ను తమ నివాసానికి సమీపంలో ఉండే ఓ ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు అనుమానం చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.