TV77తెలుగు రాజమహేంద్రవరం :
వినాయక చవితి పర్వదినాన ఆ వినాయకుని పూజించి ఏ విధమయినా విఘ్నాలు లేకుండా రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ శ్రీ మార్గాని భరత్ .ప్రధమ పూజితుడు విఘ్నేశ్వరుని పూజించ కుండా ఏది మొదలుపెట్టని ఆచారం మనం అనాదిగా పాటిస్తున్న నియమం, అటువంటి విఘ్నాల అధిపతి వినాయకుని పుట్టినరోజు ని మనం వినాయక చవితి జరుపుకుంటామని ఎంపీ భరత్ అన్నారు.మనం ఏ పూజ చేసినా శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్బజం అనే శ్లోకంతోనే మొదలుపెడతాం, ఆది పూజ్యుడు వినాయకుని దీవెనలు మన రాష్ట్రప్రజల మీద అలాగే మన ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహనరెడ్డి కుటుంబానికి ఉండాలని ప్రార్ధించిన ఎంపీ భరత్.రాజమండ్రి ఎంపీ కార్యాలయం నందు పూజా కార్యక్రమం నిర్వహించిన పిదప పలు ప్రాంతాలలో వినాయకుని మండపాలు దర్శించి, పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వాదము పొందిన ఎంపీ భరత్.వి.యల్.పురం జంక్షన్ ఆర్యపురం బ్యాంకు డైరెక్టర్ కర్రి సతీష్ ఆధ్వర్యంలో, 22 వార్డ్ కొత్త బాలమురళి దంపతుల ఆధ్వర్యంలో, గోదావరి గట్టు దుర్వాసుల సత్యనారాయణ ఆధ్వర్యంలో, ఆల్కట్ గార్డెన్స్ డబ్బింగ్ రమేష్ ఆధ్వర్యంలో, 33 వ వార్డ్ మారిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, 48 వ వార్డ్ పనస చెట్టు సెంటర్ బూరాడ భవానీ శంకర్ ఆధ్వర్యంలో, 47 వ వార్డ్ 3 వ వీధి, 37 వ వార్డ్ లలితా నగర్, ఆర్యపురం బ్యాంకు డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, గోకవరం బస్ స్టాండ్ ఆర్యపురం బ్యాంకు డైరెక్టర్ నందం స్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాలలో ఎంపీ భరత్ పాల్గొన్నారు.ఎంపీ భరత్ తో పాటు టికే విశ్వేశ్వరరెడ్డి, మార్గాని సురేష్, పీత రామకృష్ణ, మార్గాని బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.