TV77 తెలుగు రాజమహేంద్రవరం :
రాజమండ్రి పరిధిలోని ధవలేశ్వరం వద్ద గోదావరి నదికి వరద పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు గోదావరి నీటిమట్టం 11.75 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. గోదావరి వద్ద నీటిమట్టం పెరగడంతో లంక గ్రామాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు..