TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్ :
రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట పంచాయతీ జాతీయ రహదారి నుండి రైల్వే స్టేషన్ వెనకవైపు ఉండే ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి దీనికి ఒక కారణం గోదావరి నది ఉదృతమైతే రెండో కారణం అధికారుల వైఫల్యం రాజమండ్రి నగరవాసులు వాడే మురుగునీరు సావిత్రి నగర్ మీదుగా ధవలేశ్వరం నుండి గోదావరిలో కలవడం జరుగుతుంది ఈ కాలువ పూడిక తీయని కారణంగా నీరు ఈ ప్రాంతమంతా నిండిపోవడం జరుగుతుంది . సావిత్రి నగర్ వద్ద కల్వర్ట్ సేఫ్టీ వాళ్ళు లేని కారణంగా వాహనదారులు పాదచారులు ఆ కాలంలో పడిపోవడం తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విషయంపై ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని అలాగే ప్రస్తుతం రామకృష్ణ నగర్ నాగిరెడ్డి నగర్ మరియు సావిత్రి నగర్ ప్రాంత ప్రజలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండడం వల్ల నిత్యవసర సరుకులకు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి అధికారులు మరియు వాలంటీర్ల ద్వారా వారికి నిత్యవసర సరుకులు అందించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది, మండల అధ్యక్షులు యానాపు ఏసు ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తనుబుద్ధి సూర్య భాస్కరరావు, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు కందుకూరి మనోజ్ బాబు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కాలేపు సత్య సాయిరాం మండల ప్రధాన కార్యదర్శి ఎన్విబిఎన్ ఆచారి, మన్యం శ్రీనివాస్ సిద్ధాని వెంకట్, ముద్రగడ సూర్యచంద్ర మోహన్, పట్నాల నాగార్జున, మల్లివలస రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.