జిల్లా పోలీసు కార్యాలయంలో అల్లూరి జయంతి వేడుక


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

దేశం స్వతంత్రం పోరాటంలో బ్రిటిష్ పాలకులపై అతి చిన్న వయసులోనే సాయుధ పోరాటం  ద్వారా కీలకపాత్ర పోషించిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ వై  వెంకటేశ్వరరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అల్లూరి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి వెంకటేశ్వర రావు తో సహా పలువురి పోలీస్ అధికారులు. సిబ్బంది పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అల్లూరి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని స్వేచ్ఛ , స్వతంత్రం, సమానత్వం అంశాల పట్ల అల్లూరికి ఉన్న నిబద్ధతను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.