TV77తెలుగు అమరావతి :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జులై 5 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. గతేడాది వరకు జూన్ 12న బడులు తెరుస్తుండగా ఈసారి నుంచి పునఃప్రారంభం తేదీని మార్చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు బడులు కొనసాగుతాయి. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లు 220 రోజులు పనిచేస్తాయి. ఇక రేపటి నుంచి టీచర్లు స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.29న తల్లిదండ్రుల కమిటీలు, 30న ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలి.