TV77తెలుగు ఆత్రేయపురం:
గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు చనిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాలకు చెందిన మద్దుల సతీష్ (19), జంగారెడ్డిగూడేనికి చెందిన పోలిశెట్టి సిద్ధార్థ (19) స్నేహితులతో కలిసి వచ్చి బొబ్బర్లంక వద్ద కాటన్ బ్యారేజీ కింద మద్దూరు లంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు.గాలింపు చర్యలు మొదలుపెట్టగా సమీపంలో మృతదేహాలు లభ్యమయ్యాయి.