సోము వీర్రాజు పై కేసు నమోదు


 TV77తెలుగు కొత్తపేట :

 కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం జొన్నాడ 16వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం సోము, పోలీసులకు మధ్య జరిగిన ఉద్రిక్తత సంఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజుపైన ఆలమూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించి ఎస్ఐ ఎస్ శివప్రసాద్ తెలిపిన వివరాలు వివరాలు ప్రకారం  ఇటీవల కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం విధించిన 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ముఖ్యమైన నాయకులను, ఎక్కువ మంది కార్యకర్తలకు అనుమతి లేనందున జొన్నాడ వద్ద ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ తన సిబ్బంది నిర్వహిస్తున్న బందోబస్తులో భాగంగా సోము వీర్రాజు కారును ఆపడంతో ఉద్రేకానికి లోనైన సోము పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమేకాక విధి నిర్వహణలో ఉన్న ఎస్సైను నెట్టడంతో 353,506  సెక్షన్ లపై ఆలమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును మండపేట రూరల్ సిఐ శివ గణేష్ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.