TV77తెలుగు రాజానగరం :
రాజానగరం GSL హాస్పిటల్ ఎదురుగా నూతనముగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రారంభించిన రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్.సుమారు 4 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ బ్రిడ్జి వివిధ ప్రాంతాలనుండి ఈ హాస్పిటల్ కు వచ్చే ప్రజలకు, ఈ మెడికల్ కళాశాలలో చదివే విద్యార్థులకు నేషనల్ హైవే రోడ్ దాటేందుకు అనువుగా నిర్మించడం జరిగింది అని ఎంపి భరత్ తెలిపారు.నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్ మన నియోజకవర్గం లో పర్యటించినపుడు ఇక్కడ ఉన్న ఎంతో ప్రాముఖ్యత కలిగిన మెడికల్ కళాశాల, హాస్పిటల్ ఈ ప్రాంతంలో వుండటం ఈ నేషనల్ హైవే దాటి హాస్పిటల్ మరియు కళాశాల లోనికి వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు, అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో వుంచుకుని, ఇక్కడ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరం ఎంతో ఉందని వివరించిన ఎంపి భరత్ వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు దీనికి మంజూరు చెయ్యడం, యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేసుకుంది అని ఎంపి భరత్ తెలిపారు.అలాగే ఈ బ్రిడ్జి మీద ద్విచక్ర వాహనాల రాకపోకలను కూడా సాగించే విధముగా నిర్మించడం జరిగింది అని ఎంపి భరత్ తెలిపారు.త్వరలో ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా శంకుస్థాపన చేసి నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చెయ్యడం జరుగుతుంది అని, కొన్ని సాంకేతిక కారణాలు వలన జాప్యం జరగడం వాస్తవము అని, ప్రతీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రధాన కూడలులు వద్ద కొన్ని సమస్యలు ఉన్నాయని అవి అన్నీ తొందరలో పూర్తి అయ్యి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ భరత్ తెలిపారు.
GSL హాస్పిటల్ ఫ్రెషర్ డే వేడుకలలో పాల్గొన్న ఎంపి భరత్.
ఈ విద్యా సంవత్సరం లో ఎంబీబీఎస్ కోర్స్ లో జాయిన్ అయిన ఫ్రేషెర్స్ డే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపి భరత్.ఈ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, డైరెక్టర్ గన్ని సందీప్, కళాశాల ప్రొఫెసర్స్, సిబ్బంది పాల్గొన్నారు. ఎంపి భరత్ మాట్లడుతూ కొత్తగా చేరిన విద్యార్థులు మంచి ప్రమాణాలతో విద్యను అభ్యసించి మన దేశానికి, ప్రజలకు వైద్య సేవలు అందించే విధముగా మంచిస్థాయిలో ఉండాలని ఆకాక్షించారు. అలాగే GSL కళాశాల గౌరవం పెంచే విధముగా మెలగాలని ఎంపీ భరత్ కోరారు. డాక్టర్ గన్ని భాస్కరరావు గారు మాట్లాడుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రారంభించి, అలాగే మెడికల్ కళాశాలలో ఆడిటోరియం ప్రారంభించి నందుకు ఎంపీ భరత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.