కారు నుంచి పొగలు


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక లాలాచెరువు వద్ద ఓ కారు నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనచోదకులు కంగారుపడ్డారు. కారు సర్వీసింగ్ నిమిత్తం తీసుకువచ్చిన క్రమంలో కారు ముందు భాగం నుంచి ఒక్కసారిగా పొగలు రావడం గమనించిన అతడు అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కకు తీసి బయటకు వచ్చేశాడు. స్థానిక పెట్రోల్ బంకు సిబ్బంది మరియు చుట్టుపక్కల ప్రజలు సహకారంతో కారులో నుంచి మంటలు రాకుండా అదుపుచేశారు.