TV77తెలుగు రాజమహేంద్రవరం :
ఈ దఫా ఎన్నికలు ఓటుకు నోటు కాదు మా బిడ్డల భవిష్యత్ కు , మా ఆంధ్ర కు అని నిలదీయండి .
రాబోవు ఎన్నికలు నేతల మోసాలకు, ఓటర్ల ప్రతిష్టకు జరుగుతాయి.
ఈ సారి ఆంధ్రుడి ఓటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠంగా వుండాలి.
ఆంధ్రలో సరికొత్త చరిత్రకు ఆంధ్రుడు శ్రీకారం చుట్టాలి.
ఆంధ్ర రాష్ట్రమా !అంద రాష్ట్రమా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ప్రస్తుత పాలకులు ఆంధ్రులను, ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని, గడప గడపకు రావాలనుకునే ఎమ్మెల్యే, ఎంపిలను రాజకీయాలకు అతీతంగా ఓటరు నిలదీయాలని, ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, రాజమండ్రి సాంస్కృతిక అకాడమీ, విశాఖపట్నం నుండి చెన్నై పారిశ్రామిక కారిడార్, రామాయపట్నం మేజర్ పోర్ట్, కడప ఉక్కు ఫ్యాక్టరి, విశాఖపట్నం డివిజన్ తో కూడిన రైల్వే జోన్, ఆంధ్రప్రదేశ్ కు పక్కా రాజధాని నిర్మాణం, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ల కోసం నేతలను ప్రజలు నిలదీసి ఆంధ్రుడి పౌరుషాన్ని జాతీయ స్థాయిలో చాటాలని, అధికార పక్షం తో పాటు ప్రధాన విపక్షాలు ఆంధ్రకు జరుగుచున్న అన్యాయం పై సిగ్గు పడాలని, ఏమి సాధించారని ఆంధ్రప్రదేశ్ లో గడప గడపకు వస్తారని, ప్రస్తుత పాలకుల్లో ప్రజలు పక్షాన్న ప్రశ్నించే నేతలు లేకపోవడం దురదృష్టం అని,ప్రస్తుత ప్రజా ప్రతినిధులు సభలు, సమావేశాలకు, ప్రారంభోత్సవాలకు మాత్రమే పరిమితమయ్యారని, సామాన్య ప్రజలకు కనపడకుండా అజ్ఞాతంలో తిరుగుతున్నారని, ప్రజా ప్రతినిధులు గాలికి తిరగటం కారణంగా పౌర సేవలు అవినీతికి వ్యాపారంగా మారి పోయాయని, ప్రజలు మానశిక క్షోభకు గురైతున్నారని, విష నాగులు చట్ట సభల్లో ప్రాతినిత్యం వహిస్తు మంచి సమాజాన్ని విష పూరిత సమాజంగా మారుస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఈ దఫా ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలు ఓటుకు నోటు కాదు మా బిడ్డల భవిష్యత్, మా ఆంధ్ర భవిష్యత్ అని నిరూపించాలని, నేతలకు పాలకులకు కనువిప్పు కలిగే విధంగా ఆంధ్రుడు ఓటుతో చెంప పెట్టు వంటి గుణపాఠంతో బ్యాలెట్ తీర్పు చెప్పాలని,దేశ వ్యాప్తంగా ఎన్నికలు తీరు ఒక విధంగా వుంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నకల తీరు ప్రజా స్వామ్యానికి బిన్నంగా జరుగుతుంటాయని, నేర సామ్రాజ్యాధి నేతలు ఆంధ్రాలో పాలకులు గా చలామణి అవుతున్నారని, సొంత శాసనాలను అమలు చేస్తు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని, భారత్ లో ఎన్నికలు సంఘం తీరు సైతం అవినీతి పాలకులకు, దోపిడీ దారులకు కొమ్ము కాసినట్టు వుంటుందని, పాలనా సంస్కరణలు నేటి సమాజానికి అత్యవసరంగా భావించాలని, ఆంధ్ర లో ప్రజలకు మరో 50 ఏళ్లయినా భవిష్యత్ లేకుండా చేస్తున్నారని నేటి పాలకులని కారణంగా , ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పరిస్థితి అత్యంత అద్వానంగా వుందని, ఆంధ్ర లో పాలకులు మంచును చూపిస్తు అభివృద్ధి గా ప్రచారం చేసుకుంటున్నారని, ఆంధ్ర లో ప్రజలు బిక్కు బిక్కు మంటు జీవిస్తున్నారని, రాష్ట్రం లో మానవ హక్కులను కాలరాస్తున్నారని, కనీస వసతులు, మౌలిక సదుపాయాలు ప్రజలకు కానరాకుండా పోతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ దఫా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నకలు పాలకులు, నేతల మోసాలకు ఓటర్ల ప్రతిష్ట కు జరుగుతాయని, ఆంధ్రుడిని పచ్చిగా మోసం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రుడి ఓటుతో గుణపాఠం చెప్పాలని , ఆంధ్రప్రదేశ్ పుణ్య భూమి, వేద భూమి అని, ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా మట్టి కొట్టుకు పోయిందని, తెలుగు నేలపై విషం కక్కాలనుకునే ఏ పార్టికైనా భవిష్యత్ అందాకారమేనని, పుష్కలమైన సహజ ప్రకృతి వనరులు వున్న ఆంధ్రప్రదేశ్ ను ఎడారిగా మార్చాలనుకునే మోది కొంతమంది విదేశీ కార్పొరేట్ శక్తులుకు తెలుగు రాష్ట్ర ప్రజల చేత శృంగభంగం తప్పదని, బిజెపి రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ని దోచుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టికి పట్టిన గతే పడుతుందని, ఆంధ్రప్రదేశ్ పాలకులు కుంబకోణాల్లోను, కొన్ని బలహీనతలతోను ఉండటం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర నేతలను భయపెడుతు గొంతు నొక్కేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను స్వప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారని, ప్రజాస్వామ్యం లేని అప్రజాస్వామ్యం ఆంధ్ర లో రాజ్యమేలుతుందని, ఆంధ్రులకు భద్రత లేదు భవిష్యత్ లేదని పేర్లు మార్పు తప్ప ఏఒక్క అభివృద్ధి ని ఏపి నేతలు నేటి వరకు సాధించక పొగ ఆంధ్ర లో ఉన్నటువంటి గత అభివృద్ధి సైతం ప్రక్క రాష్ట్రాలకు తరిమి వేస్తున్నారని ఆయన ఎద్దేవా చేసారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు బ్రతకటానికి ఉపాధి మార్గాలు లేవు, ఉద్యోగాలు లేవు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రులకు బకాయిపడ్డవి అమలు కావు, నిత్యావసర సరుకులు, కాయగూరలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, విధ్యుత్ చార్జీలు, రవాణా సౌకర్యం సామాన్యులకు భారంగా మారిందని, పౌష్ఠిక ఆహార లోపం ఆంధ్రాలో భారిగా వుందని, పాలకుల తీరును ప్రజలు ప్రశ్నించకుండా మోనం గా వుంటే కొన్నాళ్ళకు ఆంధ్ర లో అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలిపోయే ప్రమాదం వుందని, కొన్నాళ్ళకు ఆంధ్ర లో వృద్దులు మాత్రమే వుంటారని, ఆంధ్రుల్లో ప్రశ్నించే ధోరణి రాకపోతే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ వృద్దాశ్రమంగా మారబోతుందనే సంకేతాలు కనబడుతున్నాయని, బ్రతకటానికి, జీవించటానికి పనికిరాని కులం, మతం, సినిమా మత్తు మోజులో పడి బిడ్డల భవిష్యత్ ను, ఆంధ్రప్రదేశ్ ప్రగతిని నేటి మెజారిటి ఆంధ్రులు మరిచి బ్రతికేయటానికి బానిసలుగా మారారని, ఆంధ్రుడి గతించిన చరిత్ర, మట్టి పౌరుషం ఇప్పుడు బ్రతుకుతున్నది ఇది కాదనే నిజాన్ని నేటి ఆంధ్రులు తెలుసుకుని ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్ కోసం రాజకీయ ప్రత్యామ్నాయ ఉద్యమ నిర్మాణం కై సిద్ధపడాలని, అందుకు నేను సైతం, నేను సైతం అంటు ప్రతి ఇంట మరో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి కనపడాలని,వ్యాపార రాజకీయ పార్టీలకు బానిసలుగా మారకుండా తెలుగు రాష్ట్ర ఐఖ్యత ను ఢిల్లీ కి చాటే దమ్మున్న నేతలను, దమ్మున్న పార్టీలను గెలిపించి ఢిల్లీ పార్టీలకు ఆంధ్రుడి ఓటు దెబ్బ రుచి చూపించాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ని దోపిడి పాలకుల నుండి రక్షించుకుందాం, సంపన్న రాష్ట్రాన్ని సాధించుకుందాం అని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ ఎవిఎల్ నరసింహారావు, లంక దుర్గాప్రసాద్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డె సురేష్, కొల్లి సిమ్మన్న, వల్లి శ్రీనివాసరావు,దుడ్డె త్రినాధ్ , వాడపల్లి జ్యోతిష్, దోషి నిషాంత్, వల్లి వెంకటేష్ , మట్టపర్తి తులసి, మోర్త ప్రభాకర్, రెడ్డి స్వర్ణలత, కోట సుశీల, వానపల్లి విమల తదితరులు పాల్గొనియున్నారు.
మేడా శ్రీనివాస్, ...రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్