TV77తెలుగు రాజమహేంద్రవరం:
తూర్పు గోదావరి జిల్లా రైల్వేలో ట్రాఫిక్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 7న సిల్చార్ - కోయంబత్తూర్ (12516), 22న కోయంబత్తూర్ - సిల్చార్ (12515), 20న అగర్తలా సికింద్రాబాద్ (07029) రైళ్లను రద్దు చేశారు. వాటిలో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులు ఈ విషయం గమనించాలని అధికారులు సూచించారు.