తిరుపతి దేవాంగ సత్రం స్థల రిజిస్ట్రేషన్ పూర్తి


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

రూ. 35 కోట్లతో నిర్మిస్తున్న తిరుపతి దేవాంగ సత్రం స్థల రిజిస్ట్రేషన్ పూర్తి..

సత్రం ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి కాలెపు సత్యనారాయణమూర్తి వెల్లడి..

 రూ. 35 కోట్లతో తిరుమల తిరుపతిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీనివాస ఉమా రామలింగేశ్వర దేవాంగ నిత్య అన్నదాన సత్రం స్థల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని సత్రం ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి కాలెపు సత్యనారాయణమూర్తి ఒక ప్రకటనలో వెల్లడించారు. తిరుపతిలో నాలుగు రోజుల పాటు సాగిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు బొమ్మన దుర్గాప్రసాద్, నక్కిన వెంకటరాయుడు, మాడిశెట్టి శివ శంకరయ్య, మెట్ల విఠల్ రావు, గంపా సోమలింగేశ్వర రావు, బీరా శ్యామలరావు, బండారు ఆనందప్రసాద్, కర్రా రవి, ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాల్గొన్నారన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సహకరించిన స్థల యజమానులు గణేష్ డెవలపర్స్ శ్రీధర్, అలాగే అక్కడ సహకరించిన తిరుపతి రవి, చంద్రశేఖర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో రాజమహేంద్రవరంలోని స్థానిక శ్రీ ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో ఉన్న సత్రం ప్రధాన కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి సత్రం భవన నిర్మాణాల శంకుస్థాపనకు తేదీలు ఖరారు చేయడం జరుగుతుందని కాలెపు సత్యనారాయణమూర్తి తెలిపారు.