రాజమండ్రి రూరల్ ఎమ్మార్వో ఆఫీస్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి


 డాక్టర్  బి ఆర్ అంబేద్కర్ ఆశయాలకు ప్రతి  ఒక్కరు కృషి చెయ్యాలి

రాజమండ్రి రూరల్ ఎమ్మార్వో రియాజ్ హుస్సేన్

భారత రాజ్యాంగ నిర్మాత  డా. బి.ఆర్. అంబేద్కర్  జయంతి సందర్బంగా రాజమండ్రి రూరల్ ఎమ్మార్వో ఆఫీసులో  రియాజ్ హుస్సేన్ ఆద్వర్యంలో అంబేద్కర్ 131 జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు ఈ సందర్బంగా  సామాజిక .రియాజ్ హుస్సేన్ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని  ఎమ్మార్వో రియాజ్ హుస్సేన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దారు సి.హెచ్.రామారావు, శ్రీనివాస రావు, చైతన్య బాబు, హారిక, రాఘవేంద్ర, ఎగ్జిక్యూటివ్ సిబ్బంది. వి రత్న సాగర్, హేమ సుందర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.