TV77తెలుగు రాజమహేంద్రవరం :
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఈరోజు పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ జన్మదినం అత్యంత అట్ట హసంగా అభిమానులు మధ్య జరుపుకున్నారు. మేడా శ్రీనివాస్ జన్మదినంను పురష్కరించుకుని పార్టీ సెక్యులర్స్, శ్రేణులు, అభిమానులు బారి కేకును కట్ చేయించారు. మేడా తో మా ప్రయాణం ఎంతో సంతృప్తిగా వుంటుందని, స్వచ్ఛమైన రాజకీయ నిర్మాణం కోసం ఆయన అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని, నిత్యం అనేక ప్రజాపోరాటాల్లో ఆయన కృషి వుంటుందని, ఏ విధమైన బలహీనతలు లేకుండా భాదితులకు అండగా నిలిచి న్యాయం జరిపిస్తారని, ఆయన స్ఫూర్తి మాకు శ్రీ రామ రక్ష అని, మన సమాజానికి పట్టిన కుళ్ళు, కాలుష్యం పోవాలి అంటే మేడా శ్రీనివాస్ లాంటి నేత ఎంతైనా అవసరం వుందని, నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజలు కోసం అనేక అధికారిక వేధింపులను, దాడులను ప్రజల ఆశీస్సులతో తట్టుకుని నిలబడ్డ నేత మేడా శ్రీనివాస్ అని,మానవ హక్కుల రక్షణ కోసం, జలకాలుష్య నివారణ కోసం, మన గ్యాస్ - మన హక్కు, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన, నూతన ప్రజా స్వామ్య నిర్మాణ సిద్ధాంత కర్త, మరో స్వాతంత్య పోరాట ఉద్యమ ధీరుడు,ఇలా అనేక ప్రజా పోరాటాల ఉద్యమ వీరుడు, విద్యా వేత్త, ప్రముఖ న్యాయవాది మా మేడా శ్రీనివాస్ మాకు అని తర వారధి వంటివారని, మా మేడా తోనే మెరుగైన సమాజం, భద్రత గల సమాజం సాధ్యం అని పుట్టినరోజు సందర్బంగా విచ్చేసిన వారు ఆయన వ్యక్తిత్వాన్ని కొని యాడారు. ఎవిఎల్ నర్సింహారావు అనే న్యాయవాది మేడా శ్రీనివాస్ ను ఉద్దేశించి ఒక కవిత్వాన్ని చదివారు.
కవిత్వం సారాంశం.
మిమ్ము చుస్తే మాకు గర్వం.
మీ తోడు మాకు సగర్వం.
నేటి రాజకీయ సమాజానికి మర్రి వృక్షం వంటి వాడివి.
మా ఇంట తులసి వనం వంటి వాడివి.
నిరుపేదలకు, భాదితులకు తోడుగా నిలిచే పాశుపతి అస్త్రం వంటి వాడివి.
మీ తోడు మాకు
ఓ నమ్మకం, ఓ దైర్యం వంటివి.
ప్రజా సమస్యల పట్ల అలుపెరగని ధీరుడవు.
స్నేహ దానాల్లో కర్ణుడివి, యుద్ధ వ్యూహాల్లో శ్రీ కృష్ణుడువి, అన్నిటికి మించి గొప్ప సహచరివి.
గన్ను నైనా , పెన్ను నైనా ఒకే విధంగా వాడే వాడివి.
పర్యావరణ మానవ హక్కుల రక్షకుడువి, మా ఇంటి వాడివి, ఆజ్నమాంతం నీవే మా నాయకుడివి
అని ఆనంద భాష్పాలతో చదివి వినిపించారు.
కాండ్రేగుల కొండలరావు అనే ఒక గాయకుడు మేడా ను ఉద్దేశించి సామాజిక గీతాలను ఆలపించారు.
అనంతరం స్థానిక ప్రకాష్ నగర్ లో గల హర్ఫాన్స్ హోమ్ లో సుమారు 100 మంది పిల్లలకు భోజన ఎరపాట్లు చేసారు.
అనంతరం పలువురు మేడా శ్రీనివాస్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, శివరామ కృష్ణ, బేతాళ శ్రీనివాస్, లంక దుర్గాప్రసాద్, బర్ల ప్రసాద్, కొల్లి సిమ్మన్న, పెండ్యాల కామరాజు, కాసా రాజు, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, మార్త ప్రభాకర్, పిల్లాడి ఆంజనేయులు, డివిఆర్ మూర్తి, ఎండి హుస్సేన్, దుడ్డె త్రినాధ్, వాడపల్లి జ్యోతిష్, ఖండవల్లి భాస్కర్, బత్తిన సత్యనారాయణ, కె వి రవికుమార్, రెడ్డి స్వర్ణలత, కొప్పాడ రామరాజు, కొత్తల కిషోర్, మేడా చిన్నారి, రాజా, వల్లి శ్రీనివాసరావు, వల్లి వెంకటేష్, కొత్తపల్లి నాగేశ్వరావు, కొత్తపల్లి భాస్కరరామం, అడపా శ్రీనివాస్, కూపర బుజ్జి, రామారావు, వెంకట రమణ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనియున్నారు.