TV77తెలుగు రాజమహేంద్రవరం
పవిత్ర పుణ్య మాసం.
ఉపవాసాలకు సిద్ధం.
ముస్తాబైన మస్జీద్ లు.
ఇస్లాం మతం లో అత్యంత పవిత్ర పుణ్య మాసం రంజాన్ . ఈ ఏడాది ఏప్రిల్ 3 ఆదివారం నుండి ఉపవాస దీక్షలు ఆరంభం కానున్నాయి. నెల రోజుల పాటు కఠోర ఉపవాసం ఆచరించే ముస్లింలు సర్వం సిద్ధం చేసుకున్నారు.జిల్లా లోని కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, మండపేట ల్లో మసీదు ల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మసీదుల్లో సామూహిక ప్రార్థనలు, రాత్రి వేళ తరహావి నమాజ్ లు నిర్వహించనున్నారు. కరోనా కల్లోలం లో కేవలం ఇళ్లకే పరిమితమై దైవ ప్రార్ధన చేసిన ముస్లింలు ఈ ఏడాది మసీదుల్లో నమాజ్ ,ఇఫ్తారి ఆచరించనున్నారు.
కరోర ఉపవాసాలు
రంజాన్ ఉపవాసా దీక్షలు నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఈ మాసంలో ముస్లింలు ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు చేస్తుంటారు. ఇస్లాం నమ్మకం ప్రకారం ఈ నెలలో నరకం గేట్లు మూసివేయబడి, స్వర్గం గేట్లు తెరుచుకునే ఉంటాయి.ఈ నెల రోజుల్లో పేదలకు సాయం చేయాలని చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ప్రార్థనలు చేస్తూ కఠిన ఉపవాస దీక్షలతో రంజాన్ నెల జరుపుకుంటారు. రంజాన్ పండుగ మానవాళికి హితాన్ని అందిస్తుంది.