TV77తెలుగు ఢిల్లీ :
రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ పార్లమెంట్ లో మాట్లాడుతూ దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటీకరణ చెయ్యవద్దని కోరారు.గత నెల గౌరవ కేంద్ర ఆర్థిక శాఖమంత్రి వర్యులు త్వరలో రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను పెట్టుబడుల ఉపసంహారణ, ప్రైవేటీకరణ చేయాలని తెలిపారు.ఇప్పటికే కేంద్రప్రభుత్వం నష్టాలలో వున్న బ్యాంకులను ఇతర బ్యాంకులలో విలీనం చేసి పునరుద్దరణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని అన్నారు.ఇలా బ్యాంకులను ప్రైవేటీకరణ చెయ్యడంవలన వ్యక్తిగత నినాదం, సొంత ద్రవ్య ప్రయోజనాల కోసం, వేల కోట్ల రూపాయలు వాళ్ళ మిత్రులకు లేదా సిస్టర్ కన్సర్న్ లకు రుణాలు మంజూరు చెయ్యడం, లేదా కొన్ని కంపెనీలకు రుణాలు ఇవ్వడం అవి దివాళా తీస్తే ఖాతాదారులకు హామీ ఎవరు ఇస్తారు.సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నందు ప్రజలకు సేవలు అందిస్తున్నారని వారికి ప్రైవేటీకరణ చేస్తే వారికి ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంటుంది వారు భవిష్యత్తు అగమ్యగొచరముగా అవుతుందని తెలిపారు. అలాగే సుమారు 5 లక్షల మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వారికి పే రివిజన్ చాలా ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నారని, బ్యాంకులలో కార్పస్ ఫండ్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది అని దీని నుండి ఈ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పే రివిజన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ భరత్ కోరారు.కావున కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేట్ పరం చెయ్యొద్దని కోరారు.