జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని ఎస్ పి వో లు తమ జీతాలు చెల్లించాలని శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి అసెంబ్లీ వద్దకు వెళుతున్నారని సమాచారంపై వారిని సర్కిల్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ముందస్తు అరెస్టు చేసి సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పివో లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మద్యం, అక్రమ గ్రావెల్, గుట్కా, గంజాయి వంటి మాదకద్రవ్యాలు, ఇసుక తరలింపు లను నిరోధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 2156 మందిని జగ్గయ్య పేట సర్కిల్ పరిధిలో 84 మందిని విధుల్లోకి తీసుకున్నారని, గతంలో రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తమ జీతాలు చెల్లించిదని, ఇసుకను ప్రైవేటు వారికి అప్పగించిన తర్వాత 11 నెలలుగా తమ జీతాలు లేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, గత నెలలో తమ జీతాలు చెల్లించాలని అందరూ అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదని. ఈరోజు అసెంబ్లీకి వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రహదారి వెంట ప్లేకార్డ్ ప్రదర్శించి తమ జీతాలు చెల్లించాలని వేడుకోవడానికి వెళ్తున్న తమను అరెస్టు చేసి సర్కిల్ కార్యాలయానికి తరలించారని, తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ఎస్సీ ఎస్టీ బీసీలకు మరియు అగ్రవర్ణ కులాలలో పేదలకు సైతం ఎన్నో సంక్షేమ ఫలాల ద్వారా లబ్ధి చేకూరుస్తూ. వారి కుటుంబాలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎస్పిఓల కుటుంబాన్ని కూడా తమ వైయస్సార్సీపి కుటుంబ సభ్యులు గా గుర్తించి 11 నెలల జీతాన్ని చెల్లించాలని, ఎస్ పి వో గా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నారు.