ఘనంగా దోమ్మేటి వెంకటరెడ్డి 169 వ జయంతి వేడుకలు


TV77తెలుగు రాజమహేంద్రవరం :

 విద్య ద్వారానే సంఘీయుల అభివృద్ధి సాధ్యం

నాసా  లో శిక్షణ  పూర్తి చేసుకున్న దంగేటి జాహ్నవి కి ఘన సన్మానం

ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర జేఏసీ బీసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు

విద్య ద్వారానే బడుగు బలహీనవర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంఘం జే.ఏ.సీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు  పేర్కొన్నారు. బుధవారం  రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ లోని కాటన్ హాల్లో శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి 169 వ జయంతి వేడుకలు శెట్టిబలిజ ,గౌడ, ఈడిగ, శ్రీశయన  యాత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ కార్పోరేటర్ పాలిక శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ సంఘం జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ శెట్టి బలిజ, జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి బర్మాలో వ్యాపారాలు చేసి సంపాదించిన తన యావదాస్తిని శెట్టిబలిజ జాతి అభివృద్ధి కోసం త్యాగం చేశారని అన్నారు. శెట్టిబలిజ గౌడ సంఘీయులు  ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ పాలిక శ్రీను మాట్లాడుతూ శెట్టిబలిజ, గౌడ, ఈడిగా, శ్రీశయన  యాత తదితర అన్ని కులాలలో సామాజికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. రాజకీయంగా పదవులు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. దంగేటి జాహ్నవి నాసా లో ఎయిర్ స్పేస్ లో శిక్షణ పూర్తి చేసుకోవడం జాతి గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా దంగేటి జహ్నవిని  బాలిక తోపాటు లోడ అప్పారావును ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మలకు దంగేటి రమణమూర్తి కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  అప్పారి జయప్రకాష్, హితకారిణి సంఘ మాజీ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్, శెట్టిబలిజ గౌడ శ్రీ శయన యాత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను, డాక్టర్ అనుసూరి పద్మలత, కౌండిన్య గౌడ సత్రం డైరెక్టర్లు లోడ అప్పారావు, పిల్లి నిర్మల  అత్తిలి రాజు సూరంపూడి శ్రీహరి  తదితరులు పాల్గొన్నారు.