గతేడాది జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా ఆర్మీ దుస్తులను ప్రధాని మోదీ ధరించడాన్ని తప్పుపడుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రయాగ్‌రాజ్ కోర్టు విచారించింది. వివరణ ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)కు నోటీసులిచ్చింది. విచారణను మార్చి 2కు వాయిదా వేసింది.
జవాన్లు ధరించే యూనిఫాంను ఇతరులు ధరించడం నిబంధనలు ఉల్లంఘించడమేనని, ఇలా చేసిన వారు ఐపీసీ సెక్షన్ 140 ప్రకారం శిక్షార్హులని పేర్కొంటూ న్యాయవాది రాకేశ్ నాథ్ పాండే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.