ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులపాటు వర్షాలు


TV77తెలుగు అమరావతి:

ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశముందని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ, ఆగ్నేయ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ మంగళవారం పేర్కొంది.