TV77 తెలుగు కొండపల్లి :
సంక్రాంతి పందెం రాయుళ్ల కదలికల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు....!!
కొండపల్లి మున్సిపాలిటీ పరిధి లోని అనుమానిత ప్రాంతాల్లో పికేటింగ్ ఏర్పాటు...!!
కొండపల్లి మున్సిపాలిటీ తో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిధిలో కోడి పందాల కట్టడికి నిఘా నేత్రాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించారు. కోడి పందాలకు అనుమతులు లేవని కోడి పందాల శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్ కుమార్ ఆ దిశ నిఘా కూడా పటిష్టం చేశారు..పందాలు నిర్వహించే అవకాశం ఉన్న ప్రాంతాలను జల్లెడ పట్టి పికెటింగ్ ఏర్పాటు చేశారు.. రాష్ట్రం పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు... నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే బైండ్ఓవర్ కేసులు నమోదు చేయనున్నట్లు సీఐ శ్రీధర్ కుమార్ స్పష్టం చేశారు.
సత్య...రిపోర్టర్ ,మైలవరం