సమాజ్‌వాదీ పార్టీ నేత ఇంట్లో సోదాలు


   TV77 తెలుగు  న్యూఢిల్లీ : 

ఉత్తర్‌ప్రదేశ్‌లో అవినీతి కంపు బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. అత్తరు వ్యాపారం కోట్ల వర్షం కురిపిస్తోంది. దర్యాప్తు సంస్థల సోదాల్లో వందల నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే.త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న ఈ రాష్ట్రంలో జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌, ఐటీ వంటి సంస్థల దాడులు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కన్నౌజ్‌లో మరో అత్తరు వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. సదరు వ్యాపారి పేరు పుష్పరాజ్‌ జైన్‌. సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆయన ఎమ్మల్సీగా కూడా ఉన్నారు. ఆయన 2022 కోసం 22 పువులతో తయారు చేసిన సమాజ్‌వాదీ అత్తరు విడుదల చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం రాత్రి వరకు కూడా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. పుష్పరాజ్‌. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. పార్టీకి పెద్ద ఫైనాన్షియర్‌గా చెబుతారు. పీయూష్‌ జైన్‌పై ఐటీ తరువాత జరుగుతున్న ఈ దాడి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పుష్పరాజ్‌ జైన్‌ ఇల్లు కూడా పీయూష్‌ జైన్‌ ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది.