మైనర్ బాలికపై అత్యాచారం ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు.

TV77తెలుగు  గోకవరం  క్రైమ్:

గోకవరం గ్రామంలోని కృష్ణుడిపాలెంనకు చెందిన కందికట్ల మూర్తి పై ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే గ్రామంలోని అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను శారీరకంగా లోబరుచుకుని మూర్తి  అత్యాచారం జరిపాడు .దీనిపై మైనర్ బాలిక గోకవరం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూర్తి పై కేసు నమోదు  చేసి విచారణ జరిపి కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించడం జరిగిందని గోకవరం ఎస్సై యు వి ఎస్. నాగబాబు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి గా నార్త్ జోన్ డిఎస్పి కడలి వెంకటేశ్వర రావు ఉన్నారు.