కడప - బెంగళూరు వయా వాయల్పాడు రైల్వే లైన్ కు మద్దతుగా భారీ ర్యాలీ.


 TV77తెలుగు వాల్మీకిపురం:

  కడప - బెంగళూరు రైల్వే లైన్ వయా వాయల్పాడు కు మద్దతుగా వాయల్పాడు యువత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాల్మీకిపురం గాంధీ బస్టాండ్ నుండి తహసిల్దార్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. తాసిల్దార్ కార్యాలయం ముందు కడప - బెంగళూరు వయా ముదిగుబ్బ రైల్వే లైన్ ప్రతిపాదన రద్దుచేసి వాయల్పాడు మీదుగా రైల్వే లైన్ మంజూరు చేయాలని ధర్నా, నిరసన చేపట్టారు. "కడప - బెంగళూరు రైల్వే లైన్ వయా ముద్దనూరు వద్దు వాయల్పాడు ముద్దు" అంటూ నినాదాలు చేశారు. నాయకులు తహసిల్దార్  ధనంజయకు వినతిపత్రం అందించారు. ఇందుకు సానుకూలంగా స్పందించినటువంటి తాసిల్దారు దానంజయ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా వాయల్పాడు యువ నాయకులు సాదిక్, పెద్ద మాట్లాడుతూ ఇప్పటికే వాయల్పాడు చాలా కోల్పోవడం జరిగిందని జిల్లాలోని ప్రతి చిన్న చితక మండలం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న వాయల్పాడు మాత్రం ఇప్పటికీ కూడా వెనుకబడే ఉంది వాయల్పాడు అభివృద్ధి చెందటానికి రైల్వే జంక్షన్ ఏకైక మార్గం అని ఈ రూటు వ్యాపారానికి, రవాణాకు అనుకూలమని అని తెలిపారు, ఈ విషయంలో వాయల్పాడు కు అన్యాయం జరిగితే సహించేది లేదని ఇంకా తమ తదుపరి కార్యాచరణ త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. ఇంకా సామాజిక సేవకుడు జానం గంగిరెడ్డి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం యువ నాయకులు సాదిక్, పెద్ద, షాహిన్, ఆసర్, నవీన్, షబ్బీర్, శివ, హలీం, కిరణ్, ఇమ్రాన్, తేజ, బాబి, మహేష్, ప్రవీణ్, హుస్సేన్, సామాజిక సేవకుడు జానం గంగిరెడ్డి, దళిత నాయకులు వీరభద్రయ్య, శివయ్య, విటలం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.