మీతో మేము ఉంటాం.. సీపీ సీవీ ఆనంద్


  TV77 తెలుగు  హైదరాబాద్ :

 నగర ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత రెండేళ్లుగా అందరం ఆర్థికంగా, సామాజికంగా చాలా దెబ్బ పడిందని అన్నారు. ఈ ఏడాది ఎలాంటి సమస్యలు లేకుండా కొవిడ్ మహమ్మారి నుండి బయట పడేలా చేయాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. భాగ్యనగర ప్రజలకు, పౌరులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నామన్నారు. ‘‘మేము మీతో ఉంటాం.. మాకు సహకరించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. శాంతి భద్రతల కాపాడటం లో పెద్ద పీట వేస్తామని చెప్పారు. సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.