59,038 లీటర్ల సుమారు కోటి రూపాయలు విలువ కలిగిన నాటు సారా ధ్వంసం


    TV77తెలుగు  రాజమహేంద్రవరం :

 మంగళవారం (11.01.2022) తేదీన రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో ఎస్‌ఈబీ. జాయింట్ డైరెక్టర్ ఎ.రమాదేవి  పర్యవేక్షణలో బొమ్మూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కలవగొయ్య గ్రామా శివారు ఖాలీ స్థలంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ), రాజమహేంద్రవరం నార్త్, సౌత్ మరియు కోరుకొండ స్టేషన్ల సిబ్బంది దాడులు నిర్వహించిన 1543 కేసులలో స్వాదీనం చేసుకున్న 59,038 లీటర్ల ID లిక్కర్ ను (సుమారు కోటి రూపాయలు విలువ) ధ్వంసం చేశారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎక్సైజ్ సూపరింటెండెంట్‌   యం.రాంబాబు మరియు అర్బన్ జిల్లా పొలిసు అధికారులు, యస్.ఈ.బి అధికారులు మరియు  సిబ్బంది పాల్గోన్నారు.