గడ్డం శ్రీను మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ గడ్డం శ్రీను తల్లిదండ్రులు


 TV77 తెలుగు తాళ్లపూడి :

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం. మలకపల్లి గ్రామంలో గడ్డం శ్రీను మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గడ్డం శ్రీను తల్లిదండ్రులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు దళిత వర్గాల  ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు మరియు బృందం ఆదివారం మద్దతు తెలియజేశారు.  ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు మాట్లాడుతూ దళితులకు రక్షణగా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా నేటికి దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని వీటిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.గెడ్డం శ్రీను మృతి పై గతంలో పెద్దఎత్తున ఉద్యమించామని దానికి స్పందిస్తూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ బృందం వచ్చి బహిరంగ విచారణ చేపట్టి ఇది ముమ్మాటికీ హత్యేనని వారే స్వయంగా ప్రకటించి.తక్షణమే దోషులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెళ్లినా సుమారు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. గడ్డం శ్రీను మృతదేహాన్ని నీళ్ళతో కడిగేసి కేసును తప్పుదారి పట్టించిన మద్దుకూరి శ్యాంసుందర్ మరియు మిగతా దోషులపై 302 మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.కొవ్వూరు నియోజకవర్గ అసెంబ్లీ స్థానాన్ని స్థానికులకే కేటాయించాలని కొంత మంది ఆశావహులు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులను కలుస్తూ రాజకీయ పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని స్థానికంగా ఉన్న మలకపల్లిలో దళిత యువకుడు మృతిపై పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా సమయం కేటాయించలేని నాయకులకు పదవులు ఎందుకని ఎద్దేవా చేశారు. గత వారం రోజులుగా గడ్డం శ్రీను తల్లిదండ్రుల రిలేదీక్షలు చేస్తుంటే రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం అన్యాయమని గడ్డం శ్రీను కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఈనెల 21న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి గారికి గడ్డం శ్రీను తల్లిదండ్రులతో వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. గెడ్డం శ్రీను  కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన పోలీస్ రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసిన వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  డి వి ఎఫ్ నాయకులు కొప్పాక గోపి,పూలపల్లి బాలకృష్ణ, పూలపల్లి చిరంజీవి మల్లిపూడి కిషోర్, గాలింకి ప్రేమ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.