ఎంపి ఎక్సోఫిషియ ఓటు పై అమీ తుమీనా...??


 TV77తెలుగు కొండపల్లి :

కొండపల్లి పాలన భవిష్యత్ ఇంకా కోర్టు లోనే....!!!

ఇప్పటికే ముగిసిన రెండు వాయిదాల గడువు...!!

మరో వారం పాటు తీర్పు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమచారం...!!

ఎంపి ఎక్సఫిషియ ఓటు పై వీడని సస్పెన్స్....!!

కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం భవిష్యత్ ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. నూతన మున్సిపాలిటీ మొదటి పాలకవర్గం ఎవరా అన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. పాలకవర్గ ఎన్నిక తీర్పు కోర్టు పరిధిలోకి వెళ్ళడం తో కోర్టు తీర్పు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తోందో అన్న ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే రెండు సార్లు తీర్పు వాయిదా పడగా మూడవ సారి అసలు ఆ వాయిదా వేశారా లేదా అన్నది కూడా  తెలియని పరిస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటు చుట్టు తిరుగుతుండగా ఆయన ఓటు అసలు చెల్లుతుందా లేదా అన్న దానిపైనే విస్తృతంగా చర్చ నడుస్తోంది. టిడిపి అధినయకత్వం చెప్పినట్లు ఎంపి ఓటు పై స్పష్టమైన సమాచారం ఉంటే తీర్పు ఎందుకు వాయిదా పడుతుంది అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఇంకో వారం పాటు కొండపల్లి మున్సిపాలిటీ పై తీర్పు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమచారం. అయితే వారం తో సరిపెడతారా.లేక మరి కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందా అనేది తేలాలి అంటే మరొక వారం వేచి చూడాల్సిందే. ఏదీ ఏమైనా కౌన్సిలర్ గా గెలిచాం అనే సంతోషం మాత్రం మెల్ల మెల్ల ఆవిరి అవుతున్నట్లు ఉంది అభ్యర్థుల పరిస్థితి.

రిపోర్టర్, సత్య..మైలవరం