విద్యార్థులు తప్పిన ప్రమాదం.!

 

TV77 తెలుగు కొత్తపేట :

కోనసీమలో రోడ్లు ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నాయి.ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి.ఇతర ప్రాంతాలనుంచి కోనసీమకు రావాలన్నా,ఇక్కడనుండి బయటకు వెళ్లాలన్నా ఒక పక్క ప్రధాన పంటకాలువ,మరో పక్క అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు. నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య ఈ రోడ్లుపై వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. రోడ్లు అద్వాన్నంగా ఉండటం మూలంగా రోజు ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఓడలరేవు ఇంజినీరింగ్ కాలేజీ కి చెందిన ఒక బస్సు మంగళవారం సుమారుగా 40 మంది విద్యార్థులతో కొత్తపేటవైపు వస్తుండగా డేగల వారిపాలెం సమీపంలో బస్సు గోతిలోపడడంతో బస్సు కట్టలు విరిగిపోయాయి.దీంతో బస్సు పక్కన ఉన్న పంటకాలువ గట్టు వరకు వచ్చి చెట్టు అడ్డుపడడంతో ఆగిపోయింది. లేకుంటే బస్సు కాలువలోనికి పడిపోయి ఉండేదని ఈసంఘటనను చూసిన ప్రయాణికులు తెలిపారు. బస్సులోసుమారుగా 40మంది విద్యార్థులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టు అడ్డు పడకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగిఉండేదని స్థానికులు పేర్కొన్నారు.