ఘనంగా కార్తీక్ నిశ్చయ తాంబూలాలు


TV77తెలుగు గోపాలపురం:

గోపాలపురం మండలం కరిచెర్లగూడెం గ్రామానికి చెందిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్  అనుచరుడు చెన్నంశెట్టి కార్తిక్ నిశ్చితార్థ వేడుక తాడేపల్లిగూడెం ధర్మా ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఆంద్రప్రదేశ్ స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ  ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్య అతిధులు గా హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ కర్రీ భాస్కర్ రావు , గోపాలపురం గవర్నమెంట్ కాలేజ్ ఛైర్మెన్ వెలగ శ్రీరామమూర్తి ,రాష్ట్ర యువజన కార్యదర్శి కారుమంచి రమేష్, పశ్చిమగోదావరి జిల్లా SC సెల్ల్ ప్రధాన కార్యదర్శి సాలి వేణు,గోపాలపురం  ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ,ఉభయ గోదావరి జిల్లాల ఎంపీటీసీ. జెడ్ పి టి సి. ఎంపీపీ సర్పంచ్ లు మరియు గోపాలపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.