TV77 తెలుగు ఖమ్మం క్రైమ్:
ముదిగొండ మండలం కట్టకూరు వద్ద సాగర్ కాలువలో ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్లుగా తెలుస్తున్నది. పంజాబ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు వరికోత యంత్రంతో కట్టకూరు వచ్చారు. ముగ్గురు సోమవారం సాయంత్రం కట్టంకూరులోని సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. రాత్రి నుంచి తమవారు కనిపించడం లేదని పంజాబ్ వాసుల స్థానికులకు తెలిపారు.సాగర్ కాల్వ వద్దకు వెళ్లిన వారి సెల్ఫోన్లు, చెప్పులు కాల్వ గట్టు మీద వీటిని ఉంచి వారు నీటిలోకి వెళ్లి గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. అయితే, ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైనట్లు అనుమానిస్తున్న వారి కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.