TV77తెలుగు ఇబ్రహీంపట్నం:
ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్ లో షార్ట్ సర్క్యూట్ తో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు....!!
మంటలు గుర్తించిన కార్మికులు పైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం తో కొంత మేర తగ్గిన ఆస్తి నష్టం....!!!
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని దొనబండ గ్రామం లోని ఫాబెక్స్ స్టీల్ కంపెనీ లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు ఫ్యాక్టరీ లోని కొంత మేర వ్యాప్తి చెందాయి.దీంతో తక్షణమే స్పందించిన కార్మికులు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగి ఉంటాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆస్తి నష్టం ఎంత మేర జరిగింది అనేది అంచనా వేస్తున్నారు.
రిపోర్టర్, సత్య..మైలవరం