TV77 తెలుగు బిక్కవోలు క్రైమ్ :
నకిలీ టీ పొడితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నరరూప రాక్షసులు
విలేకరులు అధికారుల అండదండలతో లక్షల్లో సంపాదన.
కాదేదీ కల్తీ అన్నింటా నేనున్నానంటూ.. కలియుగంలో కల్తీ రూపం లో ప్రజల ను రోగాల పాలు చేసి ప్రాణాలు తీయడంలో కలియుగ రాక్షస పాత్ర వహిస్తుంది కల్తీ.దీనంతటికీ తోడు చుక్క అయ్యి కాపాడుతున్న కలియుగ నరరూప రాక్షసులు నకిలీ విలేకరులు. లంచాలకు అలవాటు పడి అధికారులు . రాజకీయ నాయకులు ఉన్నారు అనడంలో సందేహం లేదు వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు ఆర్ ఎస్ పేట. పాడు బడ్డ బంగ్లాలో బూట్ పాలిష్. కి ప్రోడక్ట్ తయారవుతుందని. అనుమతులు ఉన్నాయని అంతేకాకుండా జిఎస్టి కూడా కడుతున్నామని కాగితాలు చూపించారు. లోపలికి వెళ్లి చూడగా ఆశ్చర్యపోయే నిజాలు బయటపడ్డాయి. బయట ఖాళీ స్థలంలో ఎండ పోసిన ప్రోడక్ట్. తెల్లని జిగురు మట్టి జీడి తొక్కలతో (పురుగులతో )మట్టి గా మారిన పౌడర్ సర్ఫ్ పౌడర్. మరికొన్ని పదార్థాలు కలిపి ఆరబెట్టి ఎండిన తర్వాత దానిని లోపల గదిలోకి తీసుకు వెళ్లి మిషన్లో వేసి మర పడతారు. అంతే టీ పొడి తయారైపోయింది. ఆకుపచ్చ కవర్లలో కేజీ, అరకేజీ, ప్యాకెట్లు రెడీ చేసిన తర్వాత పెద్ద పెద్ద బస్తాలలో కి. రెడీ చేసి ఆటోలో మండపేట, రావులపాలెం, అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు లారీలలో కింద నకిలీ టీ పొడి పైభాగాన కనబడకుండా. అనుమతులతో కూడిన పురుగుల మందుల పెట్టెలు లారీ పైభాగాన వేసి తరలిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా. కొందరు అధికారులు పట్టించుకోవడం లేదు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే ఫోన్ చేసిన ప్రతి సారి.. మా అధికారులు అందుబాటులో లేరు తోటకూర గోంగూర అని చెప్పడం తప్ప చర్యలు లేవు. అధికారులు విషయం.ఇలా ఉంచితే కొందరు నకిలీ విలేఖర్లు మీరెవరు మీకు పని ఏంటి? నేను ఎవరో తెలుసా. నేను చాలా పొడుగు అనపర్తి నుండి మాట్లాడుతున్నాను అక్కడినుండి వెళ్లిపోండి లేదంటే మీ పై కేసు పెట్టవలసి ఉంటుంది. అది బూట్ పాలిష్ పౌడర్ అని ఫోన్ లో ఉడత ఊపులు ఊపుతూ. నెలనెలా మామూళ్లు లతో అనకొండల బలసి పోయి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అక్షరం ముక్క రాని ఎదవలు.నేను అంత పొడుగు నేను ఇంత పొడుగు విలేకరి అని చెప్పుకోవడమే కాకుండా. తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తికి ప్రెస్ కార్డ్ ఇప్పించడం చాలా విచిత్ర కరమైన విషయం ముఖ్యంగా. తెలియవలసి ఉంది ఏమిటంటే"" ప్రజలు టీ తాగే ముందు హోటల్ లో గాని రోడ్డుపై టీ బడ్డీకొట్టు లలో రేటు తక్కువ కావడంతో 80% కల్తీ టీ పొడి వాడుతున్నారని సమాచారం తూర్పు. పశ్చిమ. విశాఖ జిల్లాలలో ఈ టీ పొడినే వాడుతున్నట్లు సమాచారం కనుక టీ పొడి చూసుకుని తాగాలి లేదంటే రోగాల పాలు అవ్వాల్సిందే అని తెలుస్తుంది.