చెడ్డీ గ్యాంగ్ ముఠా ను సవాల్‌గా తీసుకున్న అర్బన్ పోలీసులు


TV77తెలుగు రాజమహేంద్రవరం:

చెడ్డీ గ్యాంగ్ ముఠా గురించి అప్రమత్తమై ముమ్మరంగా తనిఖీలు చేస్తూ జల్లెడ పడుతున్న పోలీసులు

అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ ఐశ్వర్య రస్తోగి, ఆదేశాల మేరకు, అర్బన్ జిల్లా పరిధిలో ఉన్నత అధికారులు నుంచి క్షేత్ర స్థాయి పోలీసు అధికారులు అంతా కలసి బృందాలుగా ఏర్పడి, ఇటివల రాష్ట్రంలో  కొన్ని నగర శివారుల్లోని అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు, విల్లాలను లక్ష్యంగా ఎంచుకుంటు, తాళాలు వేసిన ఇళ్ళు కంటపడితే దొంగతనాలకు పాల్పడుతున్నా చెడ్డీ గ్యాంగ్ గురించి అప్రమత్తమై, ముమ్మరంగా రైల్వే స్టేషన్ పరసర ప్రాంతాలలో అనుమానిత ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ. లాడ్జిలను, ఆర్టీసీ బస్ స్టాండ్,  రహదారులపై మరియు అన్ని ముఖ్య కూడలిలో ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేపడుతూ అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను విచారిస్తు,  పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ పరికరాన్ని ఉపయోగించి నేర చరిత్రను తనిఖీ చేస్తు.ఈ ముఠా సభ్యుల్ని పట్టుకోవడం సవాల్‌గా తీసుకున్న అర్బన్ పోలీసులు.