TV77తెలుగు రాజమహేంద్రవరం :
అవాస్తవాలతో విభజన ద్రోహం ను దారి మళ్లిస్తున్న ఉండవల్లి.
ప్రత్యేక హోదా విభజన హామీలు సాధనే ఆంధ్రుడు లక్ష్యం.
భద్రాద్రి రామాలయం ఆంధ్ర లో కలపాలి.
విభజన ద్రోహులు రూపం మార్చు కుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త.
మేడా శ్రీనివాస్, ఆవేదన.
ఆంధ్రుడా ! మేలుకో ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం రండి కదలి రండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ కొత్త కొత్త కథనాలతో వాస్తవాలను వక్రీకరిస్తు వీరు చేసిన విభజన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, వై ఎస్ ఆర్ పుణ్యమా అంటు రెండు సార్లు రాజమండ్రి కి ఎంపిగా ఎన్నికై వార్షిక నివేదికల పేరుతొ పిట్టకథలు చెప్పి ఎంపి పదవి కాలాన్ని వృధా చేసారని,రాష్ట్ర విభజన సమయంలో కరీంనగర్ ప్రాంతంలో జరిగిన సోనియా గాంధీ సభలో సోనియా గాంధీ కి రాష్ట్ర విభజన సూచన తనే చేసానని, ఆంధ్రప్రదేశ్ లో సమైఖ్యఆంధ్రా ఉద్యమంలో పొడి పొడి గా పాల్గొంటు సమైఖ్యఆంధ్రా ఉద్యమ కారులు దృష్టి మళ్లించే విధంగా సీమాంధ్ర ఉద్యమం గా దారి మళ్లించి ఉద్యమ ద్రోహం చేసిన వారిలో ఉండవల్లి ఒకరని, ఉండవల్లి ని కాంగ్రెస్ పార్టి బహిష్కరించిన అనంతరం జై సమైఖ్యఆంధ్ర (చెప్పుల గుర్తు పార్టి) పార్టి నిర్వాహకుల్లో ఒకరిగా కొనసాగి కాలక్రమంగా రాజకీయ ఉనికిని కోల్పోయారని, మళ్ళీ పిట్ట కధలతో రాజమండ్రి ప్రతిష్ట ను సర్వనాశనం చేసే విధంగా రాజకీయ కథలతో పునప్రారంభ స్టోరిలకు ఆజ్యం పోస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు. ఒకసారి చంద్రబాబు గొప్ప పోల్ మేనేజిమెంట్ చేయగలడని, మరోసారి జగన్ పై వున్న కేసులు అతి స్వల్ప కేసులని, సి బి ఐ వారికి ఇన్వెస్టిగేషన్ చేతకాదు అన్నట్టు బారి ఉపన్యాసాలు గుప్పించి నేడు జగన్ పై ఉన్న కేసులు చాలా ఇబ్బందులు తెచ్చి పెడతాయని, జగన్ పాలన చేయలేడు అన్నట్టుగా పొంతన లేని కాలక్షేప ఉపన్యాసాలతో రాజమండ్రి ప్రతిష్ట ను మంటగలుపుతున్నారని, ఆ నాడు వీరి కారణంగా జరిగిన విభజన ద్రోహం కోసం ముందుగా ఉండవల్లి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ తరువాతనే రాజకీయాల కోసం ఉండవల్లి మాట్లాడాలని, చివరి బంతి, ఆఖరి బంతి అని పెప్పర్ స్ప్రే తో ప్రజల పరువు మంట గలిపారని, సమైఖ్యఆంధ్రా కోసం మాతో పాటుగా సుప్రీం కోర్టు లో వాజ్యం దాఖలు చేసి అత్యుత్సాహ వాదన తో న్యాయమూర్తి వారితో ఉండవల్లి ఆక్షేపణ ఎదుర్కొన్నారని, ఉండవల్లి అనేక ప్రధాన రాజకీయ పార్టీల్లో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు సాగించి భంగపడ్డారని, తిరిగి అసందర్బ ఉపన్యాసాలతో రాజమండ్రి పరువును పాడుచేయొద్దని ఆయన హితవు పలికారు. ప్రత్యేక హోదా విభజన హామీలను కొంతమంది రాజకీయ స్వార్ధ ప్రయోజనాలు కోసం రాజకీయ వ్యాపార ముడి సరుకుగా మార్చేసారని, విభజన సమయంలో కేసీఆర్ బెదిరింపులకు, బలహీనతలకు, కొన్ని ఖరీదైన తాయిలాలు తలొగ్గి విభజన సమయంలో ఏపి కి చట్ట బద్దంగా రావలసిన ఆర్ధిక వాటాను, ఖచ్చితమైన రాష్ట్ర సరిహద్దును ప్రశ్నించ లేకపోయారని, హైదరాబాద్ లో గల ఏపి ఆస్తుల వాటాను రాబెట్ట లేకపోయారని, తెలంగాణా ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారని, ఆనాటి ఏపి ఉద్యమ నేతలు స్వప్రయోజనాలకోసం ఏపి భవిష్యత్ ను తాకట్టు పెట్టేశారని, ఆనాటి నుండి నేటి వరకు ఉండవుల్లి తదితరును ప్రజలు రాజకీయంగా బహిష్కరించినప్పటికీ వీరి కారణంగా ఏపి ప్రజలు కు జరిగిన నష్టం వెల కట్టలేనిదని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.
భద్రాద్రి శ్రీ రాముల వారి దేవాలయం ఆది నుండి ఆంధ్ర ప్రాంతంలోనిదని,
తూర్పుగోదావరి జిల్లా లో ఒక బాగంగా పెనవేసుకున్నదని, భద్రాచలం తో పాటుగా దుమ్ము గూడెం ఆంధ్ర ప్రాంతంలో ఒక భాగమని, ఆ నాటి తెలంగాణా రాజు నిజాం కూడా ఆంధ్ర ప్రాంతానికి కప్పం కట్టిన చరిత్ర వుందని, ఇప్పటికి భద్రాద్రి శ్రీ రాముల వారి ఆస్తులు ఆంధ్ర లోనే వుండగా దేవాలయం మాత్రం తెలంగాణా ప్రాంతంలో వుండటం శోచనీయం అని, ఆంధ్ర లో గల ప్రధాన రాజకీయ పార్టీల నేతలు భద్రాచలం, దుమ్ము గూడెం ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చమని ఎన్నడు ప్రశ్నించకపోవటం రాజకీయ బలహీనతలకు తార్కాణంగా చెప్పవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవటంలో యువత కీలక పాత్ర పోషించాలని , ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ఉద్యమ ద్రోహుల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని,ఓటర్లు ప్రజా నేతలను మాత్రమే చట్టసభలకు పంపాలని, రాజకీయ వ్యాపారవేత్తలను, పారిశ్రామిక వేత్తలను, ప్రధాన రాజకీయ పక్షాల కట్టు బానిసలను ఓటర్లు బహిష్కరించి ఏపి అభివృద్ధి కి బాసటగా నిలవాలని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, 13 జిల్లాల అభివృద్ధి లక్ష్యం గా గురుతర బాధ్యతతో ఏపి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే చారిత్రాత్మక ఉప్పెన లాంటి విప్లవ చైతన్యం ఉద్బవించాలని, ఆంధ్రుడా మేలుకో ఆంధ్రప్రదేశ్ కాపాడుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు .అన్ని అపార ఖనిజ వనరులు పుష్కలంగా వున్న ఆంధ్రప్రదేశ్ లో నిరంతర పరం పరంగా రాజకీయ, ఆర్ధిక దోపిడి జరుగుతుందని, మోది సర్కార్ ఆంధ్రప్రదేశ్ పై విషం కక్కుతూ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా తెరవెనుక కీలక పాత్ర పోషిస్తుందని, ఆ నాటి విభజన ద్రోహులు తిరిగి రాజకీయ ప్రాబల్యం చాటుకునే కుట్రలు రచిస్తున్నారని, అసలే అనేక కష్ట నష్టాలతో నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపికి ఆ నాటి విభజన కుట్ర ద్రోహులతో ప్రజలు అప్రమత్తం గా వుండాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు.
ఈ సభకు ఆర్పిసి నగర సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి,లంక దుర్గా ప్రసాద్, ఎండి హుస్సేన్, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, కోమర్తి గోపి శ్రీనివాసరావు, ఐనవరపు దుర్గా చార్యులు, పిల్లాడి ఆంజనేయులు, మండవల్లి వెంకటేశ్వర్లు, మండవల్లి శంకర్, మండవల్లి సూరిబాబు తదితరులు పాల్గొనియున్నారు.
మేడా శ్రీనివాస్. అధ్యక్షులు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్