ఎంపీ కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు

 


TV77తెలుగు రాజమహేంద్రవరం:

రాజమండ్రి ఎంపీ కార్యాలయం నందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహనరెడ్డి  జన్మదినం (48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న) పురస్కరించుకుని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ శ్రీ మార్గాని భరత్ మరియు రూరల్ కోఆర్డినేటర్ శ్రీ చందన నాగేశ్వర్  ఆధ్వర్యంలో 3000 మంది వృద్దులకు మరియు మహిళలకు దుప్పట్లు, చీరల పంపిణి కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖమాత్యులు శ్రీ ధర్మాన కృష్ణదాస్, బి.సి సంక్షేమ శాఖమాత్యులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమాత్యులు శ్రీమతి తానేటి వనిత విచ్చేశారు.

తొలుత మంత్రులు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించి తదనంతరం 48 కేజీల కేక్ ను కట్ చేసి సిఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు,

2250 నుండి 2500 రూపాయలకు పెన్షన్ పెంచిన గౌరవ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఎన్నో పధకాలకు రూపకర్త, జననేత మన ముఖ్యమంత్రి గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెలలో చిరస్థాయిగా మిగిలిపోవాలని కోరారు.

ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ సిఎం  చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు, క్రిస్మస్ పండుగతో పాటు డిసెంబర్ నెలలో మరొక పండుగ మన ముఖ్యమంత్రి పుట్టినరోజు అని, రేపు తణుకు లో జరగబోయే ముఖ్యమంత్రి  కార్యక్రమంగురించి వివరించారు.

మంత్రి వేణుగోపాలకృష్ణ  మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలతో పరిపాలిస్తున్న జగన్  అని, ప్రతీ ఆంధ్రుడు తాను దేవుడిని కొలిచినప్పుడు కొంతభాగం మన ముఖ్యమంత్రి గురించి వేడుకోవాలని కోరారు.

యువకులు ఎంపీ భరత్  నుంచి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని, కార్యక్తమాలు రూపొందించడంలో ఎంపీ భరత్ అందరికంటే ముందు ఉంటారని, రాబోయే రోజులలో భరత్ మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

మంత్రి శ్రీమతి తానేటి వనిత  మాట్లాడుతూ స్త్రీ పక్షపాతి అయిన ముఖ్యమంత్రి  బాటలోనే ఈరోజు ఎంపీ భరత్  అందరూ స్త్రీలకే చీరలు దుప్పట్లు పంపిణి చేసి సిఎం  పుట్టినరోజు ఒకరోజు ముందుగానే వినూత్న రీతిలో జరిపారని, మన ముఖ్యమంత్రి  మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు.

ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్  మాట్లాడుతూ ఎంపీ భరత్ ఈ మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానిoచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా అర్బన్ మరియు రూరల్ నుండి 3000 మందికి చీరలు, దుప్పట్లు పంపిణీ చేసి వచ్చినవారందరికి విందు కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ మరియు రూరల్ నుండి ఇంచార్జిలు, వివిధవిభాగాల కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీపీ లు, ఎంపీటీసీ లు, పార్టీశ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.