TV77తెలుగు కొండపల్లి :
చెప్పే వారు లేరా...చెప్పినా వినేవారు లేరా....!!!
ప్రభుత్వ అధికారుల చేతగాని తనమా...?? డాక్టర్ ఎన్టీటీపీస్ యాజమాన్య నిరంకుశ వైఖరికి నిదర్శనమా...??
పర్యాటకానికి కళంకం...!! విద్యా అభ్యాసానికి విఘాతం..!! జన జీవనం అస్త వ్యస్తం...!!
ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి ఖిల్లా పర్యాటక ప్రాంతానికి కళంకం వాటిల్లనుంది. విద్యార్థుల విద్యాభ్యాసానికి విఘాతం ఏర్పడుతుంది. కిల్లా రోడ్ లోని జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. వీటన్నిటికీ మూలకారణం బూడిద నిర్లక్ష్యం. ఒకపక్క బూడిద ఎగిసి పడుతుంటే మరో పక్క బూడిద నీరు నిండా ముంచేస్తోంది. డాక్టర్ ఎన్టీటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్య నిరంకుశ ధోరణి ఫలితంగా స్థానిక ప్రజలు విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు సైతం తీవ్ర అవస్థలు పడుతున్న దుస్థితి.కొండపల్లి ఖిల్లా రోడ్ లోని బూడిద రవాణా స్థానిక ప్రజలను తీవ్ర అనారోగ్యం బారిన పడ వేస్తోంది.. ఇదే విషయంపై స్థానికులు ఆందోళన బాట పట్టిన వీటీపీఎస్ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు.అందుకు గల కారణం మండల స్థాయి అధికారుల నిర్లక్ష్య ధోరణి, డాక్టర్ ఎన్టీటీపీఎస్ అధికారుల నియంతృత్వ ధోరణి ఫలితం గా కనిపిస్తోంది.ఓ పక్క బూడిదతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో పక్క బూడిద నీరు మరింత ఇబ్బంది పెడుతోంది. కిల్లా కి వెళ్లే మార్గంలో బూడిద నీరు ప్రవహిస్తూ చెరువులను తలపిస్తుంది. విషయమై అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. బూడిద రవాణా గురించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ పాటించాలని ఎన్ని ఫిర్యాదులు చేసిన తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బూడిద నీరు రోడ్ల మీదకు రావడం తో పర్యాటకులకు, కళాశాలకు వెళ్ళే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా బూడిద రవాణా ఇతర కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ ఎన్టీటీపీఎస్ యాజమాన్యంపై కనీస చర్యలు తీసుకోవడం గాని, కాలుష్య నివారణకు తగిన ఆదేశాలు ఇవ్వడం గానీ ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేయకపోవడంపై స్థానిక ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బూడిద కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
రిపోర్టర్,సత్య..మైలవరం