వై.వి సుబ్బారెడ్డి రాజమహేంద్రవరం నగర పర్యటన


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

ఈతకోట భాపన సుధారాణి సురేష్ కుమార్

పార్టీ కొరకు శ్రమించి పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది వై. వి సుబ్బారెడ్డి హామీ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీ.టీ.డీ చైర్మన్ మరియు ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి  రాజమహేంద్రవరం నగర  పర్యటనలో భాగంగా  14వ వార్డు మాజీ కార్పొరేటర్ రాజమహేంద్రవరం  నగర పాలక సంస్థ విఫ్  ఈతకోట భాపన సుధారాణి సురేష్ కుమార్ మర్యాద పూర్వకంగా కలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా సుధారాణి ఆయనతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగర వై ఎస్ ఆర్ సి పార్టీ లో వైసీపీ విర్భావం నుండి పార్టీకోసం శ్రమించి 2014 లో 14 వ వార్డు కార్పొరేటర్ గా గెలుపొంది అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దివంగత నేత బొమ్మన రాజ్ కుమార్ అప్పటి ఎన్నికల్లో తాను  ప్రాతినిధ్యం వహిస్తున్న 14 వ వార్డులో నుండి అత్యధికంగా మెజారిటీ ఇవ్వడం జరిగింది అని తెలియజేయడం జరిగింది. అలాగే 2019 ఎన్నికల్లో కూడా 14 వ వార్డు నుండి అత్యధిక మెజారిటీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటి వరకు వైస్సార్సీపీ పోటీ చేసిన రెండు శాసనసభ ఎన్నికల్లో రాజమహేంద్రవరం నగరంలో 14వ వార్డు నుండి మాత్రమే అత్యధిక  మెజారిటీ ఇవ్వడం జరిగింది అని తెలియజేస్తూ..పార్టీకోసం ఎంతో కష్టపడిన తనకు పార్టీ నుండి సరైన గుర్తింపు దక్కలేదు అని సుబ్బారెడ్డి కి తెలియజేస్తూ అలాగే పార్టీకోసం మొదటినుండి శ్రమించిన ప్రతి ఒక్కరిని గుర్తించాలని కోరడం జరిగింది. దానికి పెద్దలు వై.వి సుబ్బారెడ్డి  తప్పకుండా అందరికి న్యాయం చేస్తాను అని హామీ తెలియపర్చడం జరిగింది.