తగ్గిన వెండి.. బంగారం రేటులో ఎలాంటి మార్పు లేదు

TV77తెలుగు; 

 పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర సోమవారం స్థిరంగా కొనసాగింది. పసిడి రేటు స్థిరంగా ఉంటే. వెండి రేటు మాత్రం స్వల్పంగా తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగిచ్చింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా కొనసాగింది. దీంతో బంగారం ధర రూ.49,850 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.45,700 వద్దనే నిలకడగా కొనసాగుతోంది.బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు మాత్రం స్వల్పంగా దిగివచ్చింది. సిల్వర్ ధర రూ.100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,000కు క్షీణించింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది స్వల్ప ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.15 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1802 డాలర్లకు దిగొచ్చింది. వెండి రేటు కూడా నేలచూపులు చూసింది. వెండి ధర ఔన్స్‌కు 0.81 శాతం తగ్గుదలతో 22.34 డాలర్లకు క్షీణించింది. గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను జీఎస్‌టీ, ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి.