TV77 తెలుగు రాజమండ్రి రూరల్ :
శాటిలైట్ సిటీ గ్రామంలో గల యేసయ్య సహాయ మందిరం మరియు ఐ.ల్.టి.డి లో గల గ్లోరియా డై లూథరన్ చర్చ్ లో జరిగిన క్రిస్టమస్ వేడుకలకు నాగేశ్వర్ రావు హాజరయ్యారు.
చందన నాగేశ్వర్ మాట్లాడుతూ శాంతి దూత ఉదయించిన రోజు, ప్రభు క్రీస్తు జన్మించిన సుధీనం, ఆర్తులు కానీళ్లను, ప్రజల పాపాలను తన రక్తం తో కడిగి పరిశుద్దలను చేసేందకు దేవుని సువార్తను మోసుకువొచ్చిన దేవుడు యేసు క్రీస్తు అని, ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో అనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరకీ ఆదర్శప్రాయం అని తెలియజేసారు.
ఏసు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదర,సోదరీమణులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవ. జి. సామ్ సంపత్ కుమార్ & పాస్టర్ ఏలీయా మరియు శాటిలైట్ సిటీ వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.