TV77 తెలుగు కొండపల్లి:
బెదిరించినా...ప్రలోభపెట్టినా......!!!
అదిరేది లే..బెదిరేది లే...!!!అసలు తగ్గేదే లే...!!!
టిడిపి కార్యవర్గ సమావేశం లో కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి నేతలు, కౌన్సిలర్ అభ్యర్థుల ఉద్ఘాటన....!!!
కొండపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకునే విధంగా టిడిపి శ్రేణుల్లో ధైర్యం నూరిపోసిన టిడిపి అధినాయకత్వం...!!!
అధికార వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు..!!!
ప్రతిష్టాత్మక కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టిడిపి జెండా ఎగారేయలని టిడిపి అధినాయకత్వం దిశ నిర్దేశం చేసింది. ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న టిడిపి అధిష్టానం నిన్న ఇబ్రహీంపట్నం లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు పలు కీలక అంశాలను అధినాయకత్వం ముందు ప్రస్తావించారు.కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అధికార పార్టీ నేతలు ప్రలోభ పెడుతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఎవరు ఎన్ని చేసినా తెలుగు సైనికులు అసలు తగ్గొద్దనీ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంపి కేశినేని నాని, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వర రావు , ఇంకా పలువురు కీలక నేతలు పాల్గొని కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఎవరు ఎన్ని బెదిరించిన , ఎన్ని కేసులు పెట్టిన సరే కొండపల్లి మున్సిపాలిటీ నీ కైవసం చేసుకోవాలని దిశ నిర్దేశం చేశారు.
రిపోర్టర్,సత్య.. మైలవరం