TV77తెలుగు కొండపల్లి :
డెంగీ మహమ్మారికి మరో నిండు ప్రాణం బలి...!!!
డెంగీ జ్వరం తో కొండపల్లికి చెందిన 17 ఏళ్ల యువతి మృత్యువాత..??
కొండపల్లి లో ఇది రెండవ మరణం కావడంతో ఆందోళనలో ప్రజానీకం...!!
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ పంజా విసురుతోంది. ప్రాణాంతక జ్వరాల కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కొండపల్లి ప్రాంతం లో ఇప్పటికే డెంగీ జ్వరం తో ఒకరు బలి కాగా తాజాగా మరో 17 ఏళ్ల యువతి మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. కొండపల్లి ప్రాంతంలో వరుసగా రెండవ మరణం సంభవించడం తో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే విష జ్వరాలతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజానీకానికి ప్రాణాంతక డెంగ్యూ మరణాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
రిపోర్టర్,సత్య..మైలవరం